PUBG Addiction: తెల్లారేదాక పబ్‌జీ ఆడాడు, తరువాత ఉరేసుకున్నాడు, రాజస్థాన్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసిన కోట పోలీసులు
తాజాగా ఓ 14 ఏళ్ల కుర్రాడు తెల్లారేదాకా పబ్జీ గేమ్ ఆడి, అనంతరం పక్క గదిలోకి వెళ్లి ఉరేసుకుని (Rajasthan Teen Hangs Self) మరణించాడు..
Jaipur, june 8: స్మార్ట్ ఫోన్లు (SmartPhones) వచ్చిన తరువాత మనిషి దానికి పూర్తిగా బానిసగా మారాడు. ఇంకా చెప్పాలంటే నేటికాలంలో కుర్రాళ్లు జీవితానికి పనికి వచ్చే పనులకంటే, జీవితాన్ని నాశనం చేసే వాటిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.. ఇందులో ప్రతి వారి చేతిలో మొబైల్ (Mobile) అందులో నెట్ ఉంటే చాలు దానికి పూర్తి బానిసగా మారిపోతున్నారు. ఇందులో చాలా ఎక్కువ మంది యువత పబ్‌జీ (PUBG) లాంటి ప్రమాదకరమైన గేమ్ లకు అలవాటు పడుతుండగా, మరికొందరు అశ్లీల వీడియోలు చూడటానికి సెల్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఒకే IMEI నంబరుతో 13 వేల ఫోన్లు, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ న్యూస్ వెలుగులోకి, మొబైల్ ఫోన్ తయారీ సంస్థపై కేసు నమోదు చేసిన మీరట్ పోలీసులు
ఇకపోతే పబ్‌జీ గేమ్ లు ఇప్పటికే ఎందరో ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.. తాజాగా ఓ 14 ఏళ్ల కుర్రాడు తెల్లారేదాకా పబ్జీ గేమ్ ఆడి, అనంతరం పక్క గదిలోకి వెళ్లి ఉరేసుకుని (Rajasthan Teen Hangs Self) మరణించాడు.. రాజస్థాన్‌లోని కోటాలో వెలుగుచూసిన ఈ ఘటన తాలూకు వివరాలు చూస్తే..
రాత్రంతా మొబైల్‌లో పబ్‌జీ గేమ్ ఆడిన ఓ యువకుడు అనంతరం ఉరేసుకుని చనిపోయాడు. రాజస్థాన్‌లోని కోటాలో గాంధీ కాలనీలోని ఓ సైనిక కుటుంబానికి చెందిన 14 ఏండ్ల అబ్బాయి మూడు రోజుల కిందట తన తల్లి మొబైల్ ఫోన్‌లో పబ్‌జీ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆ ఆట ధ్యాసలోనే పడిపోయాడు. సోదరుడు చదువుతున్న గదిలో శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు మొబైల్‌లో పబ్‌జీ ఆడుతూనే ఉన్నాడు.
అనంతరం పడుకునేందుకు మరో గదిలోకి వెళ్లిన ఆ యువకుడు, ఉదయానికి సీలింగ్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారన్నారు. బాలుడి తండ్రి అరుణాచల్ ప్రదేశ్‌లో సైనిక విధుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్లు వెల్లడించారు.