Jio 'Emergency Data Loan': డబ్బులు చెల్లించకుండానే జియో నుంచి 1జీబీ డేటా, కొత్తగా ఎమర్జెన్సీ డేటా లోన్ ప్లాన్ ప్రకటించిన రిలయన్స్ జియో, జియో నుంచి ఎమర్జెన్సీ డేటా లోన్ ఎలా పొందాలో ఓ సారి తెలుసుకోండి
అత్యధికమంది కస్టమర్లకు కలిగిన నెట్ వర్క్ గా యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను అందిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త ఆఫర్ కు (Jio Offers) తెరలేపింది.
దేశంతో ఉచిత ఆఫర్లతో దిగ్గజ టెల్కోలకు షాకిచ్చిన జియో దేశంలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. అత్యధికమంది కస్టమర్లకు కలిగిన నెట్ వర్క్ గా యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను అందిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త ఆఫర్ కు (Jio Offers) తెరలేపింది. ఇందులో భాగంగా రోజువారీ హై స్పీడ్ డేటా లిమిట్‌తో ఎదురయ్యే ఇబ్బందులు తీర్చేలా ఎమర్జెన్సీ డేటా లోన్ ప్లాన్ (Jio 'Emergency Data Loan') ప్రకటించింది.
చాలా మంది వినియోగదారులు తమ రోజువారీ డేటా కోటాను చాలా త్వరగా వినియోగించేస్తున్నారు. ఆ తర్వాత రోజంతా హై స్పీడ్ డేటా లేకుండా ఉండిపోతున్నారు. దీంతో ప్రతి వినియోగదారుడు వెంటనే 1 జీబీ డేటాను టాప్ అప్ చేసుకునేలా కొత్త ప్లాన్ అమల్లోకి తెచ్చింది. ఈ టాప్ అప్ డేటాకి సంబంధించిన రీఛార్జ్ ఎమౌంట్‌ని తర్వాత పే (Recharge Now Pay Later) చేయవచ్చు. ఒక్కో ప్యాక్ ధర రూ .11గా ఉంది. దీంతో 1 జీబీ డేటా అదనంగా వస్తుంది. ఈ సౌకర్యం ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో అందిస్తోంది.
ఎమర్జెన్సీ డేటాలోన్ పొందాలంటే..
మై జియో యాప్‌లో మెనూలోకి వెళ్లాలి. అందులో మొబైల్ విభాగాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ ఎమర్జెన్సీ డేటా లోన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మొదట యాక్టివేట్ నౌ ఆ తర్వాత ప్రోసీడ్ అనే ఆప్షన్లు వస్తాయి. ఈ ప్రాసెస్ ఫాలో అయితే 1 జీబీ డేటా అప్పటికప్పుడు లభిస్తుంది. మొత్తం ఐదు సార్లు ఇలా డేటా లోన్ తీసుకోవచ్చు.