Reliance Digital Offers: కేజీ బంగారం, లగ్జరీ కారు గెలుచుకోండి, ఆఫర్లతో అదరగొడుతున్న రిలయన్స్ డిజిటల్, ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేరుతో సంబరాలు, అక్టోబర్ 5 నుంచి 8 వరకు ఆఫర్స్

వినియోగదారులను ఆకట్టుకోవడానికి రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ రిటైల్ అవుట్‌లెట్లలో లభించే ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తిపై 15 శాతం క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్‌లపై మరో 10 శాతం అదనపు రాయితీని ఇస్తున్నది.

Festival of Electronics Sale (Photo-Twitter)

Mubmbai, October 5:  ఈ  కామర్స్ దిగ్గజాలు ఆఫర్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో రిలయన్స్ డిజిటల్ కూడా ఆఫర్ల సునామికి తెరలేపింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ రిటైల్ అవుట్‌లెట్లలో లభించే ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తిపై 15 శాతం క్యాష్‌బ్యాక్, యాక్సెసరీస్‌లపై మరో 10 శాతం అదనపు రాయితీని ఇస్తున్నది. అలాగే లక్కీ వినియోగదారులు కిలో బంగారం, విలాసవంతమైన కార్లు, మోటార్‌సైకిల్, ఎల్‌ఈడీ టీవీ, ల్యాప్‌టాప్, ఐఫోన్లను గెలుచుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. ఈ నెల 5 నుంచి 8 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్లలో లభించనున్నది.

వీటితో పాటు ఏజియో వోచర్, జియోసావన్ ప్రో ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్ లాంటి బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో పాటుగా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రిలయెన్స్ డిజిటల్‌లో ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయెన్స్ డిజిటల్, మైజియో స్టోర్స్‌లో టెలివిజన్స్, హోమ్ అప్లయెన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, యాక్సెసరీస్‌పై ఈ ఆఫర్లను పొందొచ్చు.

ఆఫర్ల జోరు 

అలాగే కస్టమర్ తాము కొనుగోలు చేసే ప్రతీ ప్రొడక్ట్‌ను ప్రత్యక్షంగా పరీక్షించి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. 'ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' సేల్‌లో మరిన్ని ఆఫర్ల గురించి www.reliancedigital.in వెబ్‌సైట్‌ ద్వాకా తెలుసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 6700 పట్టణాల్లో 7700 జియో స్టోర్స్, 2000లకు పైగా మైజియో స్టోర్స్, 370కు పైగా పెద్ద రిలయెన్స్ డిజిటల్ స్టోర్స్ ఉన్నాయి.