SBI Card Enables RuPay Credit Cards On UPI: రూపే క్రెడిట్ కార్డు ఉన్నవారు నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చు, యూపీఐతో ఎస్బీఐ క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయడం ఎలాగో తెలుసుకోండి
ఇక నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డులను రూపే ప్లాట్‌ఫామ్ మీద యూపీఐతో అనుసంధానిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
SBI Card enables RuPay credit cards on UPI: ప్రభుత్వ రంగ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అనుబంధ ఎస్బీఐ కార్డ్స్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డులను రూపే ప్లాట్‌ఫామ్ మీద యూపీఐతో అనుసంధానిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
ఇక నుంచి రూపే ప్లాట్‌ఫామ్ నుంచి జారీ చేసే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు యూపీఐ లావాదేవీలు జరుపొచ్చు. థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్‌తో రిజిస్టర్ చేసుకున్న క్రెడిట్ కార్డు నుంచి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. రూపే ప్లాట్‌ఫామ్‌పై ఎస్బీఐ క్రెడిట్ కార్డు చెల్లింపుల విస్తరణతో యూజర్లకు నిరంతర చెల్లింపుల ఫెసిలిటీ లభిస్తుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
యూపీఐ లైట్ లిమిట్ రూ. 500 పెంపు, పాస్‌వర్డ్ అవసరం లేకుంగా మీరు ఇకపై 500 వరకు పేమెంట్ చేసుకోవచ్చు
రూపే ప్లాట్ ఫామ్ మీదుగా యూపీఐతో క్రెడిట్ కార్డు చెల్లింపులకు అనుమతితో కస్టమర్లకు ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. దీంతో క్రెడిట్ కార్డుల వాడకంలో గణనీయ పురోగతి నమోదు కానున్నది’ అని ఎస్బీఐ తెలిపింది. యూపీఐ, ఎస్బీఐ కార్డు తాజా నిర్ణయంతో ముందుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు తమ కార్డులను యూపీఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అటుపై తమ క్రెడిట్ కార్డులను ఉపయోగించి మర్చంట్లకు చెల్లింపులు జరుపవచ్చు. రూపే ప్లాట్‌ఫామ్‌పై ఎస్బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి జరిపే యూపీఐ లావాదేవీలు ఉచితంగా చేయవచ్చు.
మీ SBI కార్డ్ జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIలో ఎలా లింక్ చేయాలి
దశ 1: ప్లే/యాప్ స్టోర్ నుండి ప్రాధాన్య UPI థర్డ్ పార్టీ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయండి.
దశ 2: UPI యాప్‌లో మీ మొబైల్ నంబర్‌ను ధృవీకరించండి. నమోదును పూర్తి చేయండి.
దశ 3: విజయవంతమైన నమోదును పోస్ట్ చేయండి, “క్రెడిట్ కార్డ్/ లింక్ క్రెడిట్ కార్డ్‌ని జోడించు” ఎంపికను ఎంచుకోండి.
దశ 4: క్రెడిట్ కార్డ్ జారీచేసేవారి జాబితా నుండి "SBI క్రెడిట్ కార్డ్"ని ఎంచుకోండి.
దశ 5: లింక్ చేయడానికి మీ SBI రూపే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోండి.
దశ 6: ప్రాంప్ట్ చేసినప్పుడు మీ క్రెడిట్ కార్డ్, గడువు తేదీ యొక్క చివరి 6 అంకెలను నమోదు చేయండి.
దశ 7: మీ 6-డిగ్‌ని సెట్ చేయడానికి కొనసాగండి ..