Nikola Tesla: వీడు పుడితే జీవితం అంతా చీకటే అన్నారు, వాడే నేడు ప్రపంచానికి వెలుగులు పంచటానికి కారణమయ్యాడు.

ఆ సమయంలో బిడ్డ పుట్టడం చెడు శకునం అని బిడ్డ భవిష్యత్తు అంతా చీకటిమయం, ఇతడో చీకటి బిడ్డ అని మంత్రసానిగా వ్యవహరించిన మహిళ...

మీరు నికోల టెస్లా అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఫిజిక్స్ , ఎలక్ట్రానిక్స్ చదివిన వారికి ఈ పేరు సుపరిచితమే. అది 1856వ సంవత్సరం జూలై 9 అర్ధరాత్రి. ఒక తల్లి పురిటినొప్పులతో బాధపడుతున్న వేళ మరోవైపు బయట తీవ్ర తుఫాను, ఉరుములు మెరుపులతో భారీ వర్షం అయితే ఆమెకు ఇంటివద్దే ఓ మంత్రసాని పురుడుపోస్తుంది. ఆ ఉరుములు మెరుపుల మధ్యే ఆ తల్లి ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు మంత్రసానిగా వ్యవహరించిన ఆ మహిళ, ఇలా ఉరుములు మెరుపుల మధ్య బిడ్డ పుట్టడం మంచి శకునం కాదు. ఈ బిడ్డ భవిష్యత్తు అంతా చీకటిమయం, ఇతడో చీకటి బిడ్డ అని చెప్పిందట. అయితే ఆ తల్లి మాత్రం అందుకు ఒప్పుకోలేదట. తన బిడ్డ చీకటిబిడ్డ కాదు, వెలుగుల బిడ్డ.. వెలుగులు పంచే బిడ్డ అని ప్రతిగా చెప్పుకొచ్చిందట. ఆ తల్లి సంకల్పం ఎంత బలమైనది అంటే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఎలక్ట్రానిక్స్ లో ఓ గొప్ప ఆవిష్కరణవేత్తగా అతడే నికోల టెస్లా.

ఇంతకీ ఈ నికోలస్ టెస్లా ఏం చేశాడండే 'ఆల్టర్నేటింగ్ కరెంట్' సిస్టమ్ ను కనుగొన్నాడు. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఏంటి అంటే ఇప్పుడు మనం చాలా విద్యుత్ పరికరాలపై చూస్తే AC అని రాసిఉంటుంది. సాధారణంగా విద్యుత్ సరాఫరాలో AC మరియు DC. ఇక్కడ DC అంటే డైరెక్ట్ కరెంట్. పవర్ ప్లాంట్ లలో అత్యధిక పవర్ ఉంటుంది. ఈ పవర్ నేరుగా సరఫరా చేయడం అంటే అది చాలా ఖర్చు మరియు ప్రమాదంతో కూడుకున్న పని. ఆ విద్యుత్ ప్రవాహం ఓల్టేజ్ తగ్గించి, వివిధ మార్గాల్లో విద్యుత్ ను సరఫరా మార్గాన్ని మార్పు చేయడమే ఈ ఆల్టర్ నేటింగ్ కరెంట్ AC. ఇప్పటికీ కూడా గృహ అవసరాలకు, ఫ్రిజ్, మిక్సర్, ఏసి మొదలగు ఎలక్ట్రానిక్ పరికరాలకు ఈ ఆల్టర్ నేటింగ్ సిటమ్ ద్వారానే విద్యుత్ సరఫరా చేయబడుతుంది.

కరెంట్ లేనప్పుడు వాడే జనరేటర్, బ్యాటరీ వ్యవస్థలు కూడా ఈ ఆల్టర్ నేటింగ్ కరెంట్ వ్యవస్థ ద్వారానే పనిచేస్తాయి. ఇప్పుడున్న ట్రాన్స్ ఫార్మర్లు ఇవే పనిచేస్తాయి. అంటే చూడండి ఒక్కసారి విద్యుత్ ను ఆల్టర్ నేట్ చేయడం ద్వారా ఎంతమందికి ఎన్ని రకాలుగా విద్యుత్ ను వినియోగించుకుంటున్నారు? విద్యుత్ ను కనుగొన్నది బెంజిమెన్ ఫ్రాంక్లిన్ అని చెప్తారు కానీ, ఆ విద్యుత్ అందరి అవసరాలు తీర్చేందుకు మార్గం చూపింది మాత్రం నికోల టెస్లా. చీకటి బిడ్డ అని పిలువబడ్డ వాడే అతడి తల్లి చెప్పినట్లుగా వెలుగు బిడ్డ అయ్యాడు.



సంబంధిత వార్తలు

SBI Jobs Update: నిరుద్యోగులకు అలర్ట్, ఎస్‌బీఐలో 10 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

Tesla Cars: రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం 16.80 లక్షల టెస్లా కార్లు రీకాల్‌, ఉచితంగా మరమ్మతులు చేస్తామని ప్రకటన

Sanatnagar Suspicious Deaths: బాత్రూంలో ఒకే కుటుంబానికి చెందిన‌ ముగ్గురి శ‌వాలు, గీజ‌ర్ షాక్ కొట్టిందా? లేక ఎవ‌రైనా చంపేశారా? అనుమానాస్ప‌ద మృతిగా పోలీసుల కేసు

Electricity Bills Payment: కరెంట్ బిల్లుల చెల్లింపులపై కీలక అప్‌డేట్, ఇకపై మీరు పేమెంట్లు అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చెల్లించాలి, జులై 1 నుంచి అన్నిగేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపుల నిలిపివేత