Parkinson’s- Coffee Link: కాఫీ తాగుతున్నారా? అయితే, ‘పార్కిన్సన్స్’ వ్యాధి బారినపడే ముప్పు తక్కువే.. తాజా అధ్యయనంలో వెల్లడి
తరుచూ కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని నివేదికలు చెప్తే, కాఫీ ఎంతమాత్రమూ తాగనివారితో పోల్చితే కాఫీ తాగేవారికి ‘పార్కిన్సన్స్’ వ్యాధి బారినపడే ముప్పు తక్కువని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
Newdelhi, May 27: తరుచూ కాఫీ (Coffee) తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని కొన్ని నివేదికలు చెప్తే, కాఫీ ఎంతమాత్రమూ తాగనివారితో పోల్చితే కాఫీ తాగేవారికి ‘పార్కిన్సన్స్’ (Parkinson’s) వ్యాధి బారినపడే ముప్పు తక్కువని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. 1,84,024 మంది నుంచి సేకరించిన డాటాను విశ్లేషించి.. పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు.
ఏమిటీ పార్కిన్సన్ వ్యాధి?
పార్కిన్సన్ వ్యాధితో బాధపడే రోగిలో మెదడు పనితీరు మెల్లగా దెబ్బతింటుంది. అసంకల్పితంగా వణకడం, కదలికలు నెమ్మదించటం, కండరాలు బిగుసుకుపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి చికిత్స లేదు. జన్యుపరంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.