IPL Auction 2025 Live

Extinction-Level Event: ‘కిలోనోవా’ పేలుడుతో భూమిపై జీవం అంతం? ఇంకా ఎన్నేండ్లలో ప్రమాదం ఉన్నదంటే?

వీటిని ఛేదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమెరికా ఖగోళ పరిశోధకులు ఓ షాకింగ్‌ విషయాన్ని కొనుగొన్నారు.

Kilonova (Credits: X)

Newdelhi, Nov 6: విశ్వంలో (Universe) అంతుబట్టని రహస్యాలెన్నో. వీటిని ఛేదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న అమెరికా (America) ఖగోళ పరిశోధకులు ఓ షాకింగ్‌ విషయాన్ని కొనుగొన్నారు. విశ్వంలో జరిగే కిలో నోవా (Kilonova) అంతరిక్ష పేలుడు భూమిపై ఉన్న జీవం అంతానికి కారణమవుతుందని తేల్చారు. రెండు న్యూట్రాన్‌ నక్షత్రాలు ఢీకొట్టుకోవడం లేదా న్యూట్రాన్‌ స్టార్‌ బ్లాక్‌ హోల్‌ లో కలిసిపోవడాన్ని కిలోనోవా అంటారు. భూమి నుంచి 36 కాంతి సంవత్సరాల దూరంలో గనుక ఈ కిలోనోవా దృగ్విషయం సంభవిస్తే గామా, ఎక్స్‌, కాస్మిక్‌ కిరణాలు ప్రాణాంతకమైన రేడియేషన్‌ను విడుదల చేస్తాయని, దీనివల్ల భూమిపై ఉన్న జీవరాశి తుడుచుకుపెట్టుకుపోతుందని పరిశోధకులు గుర్తించారు.

Telangana Elections Liquor Shops Bandh: 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాల బంద్‌.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాలు

Corona, Cancer Detection in Three Minutes: 3 నిమిషాల్లో కొవిడ్‌, క్యాన్సర్‌ గుర్తించే పరికరం.. యూకే శాస్త్రవేత్తల అభివృద్ధి 

ఇప్పుడు కాదు

భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదమేమీ లేదని, కిలోనోవాలాంటి దృగ్విషయాలు చాలా అరుదుగా జరుగుతాయని తెలిపారు. ఒకవేళ ఇలాంటి విపత్తు జరుగాల్సి ఉంటే అది వెయ్యి ఏండ్ల తరువాతే అని పేర్కొన్నారు.