Cartosat-3: ఉగ్ర కదలికలను పసిగట్టనున్న కార్టోశాట్-3, చంద్రయాన్-2 తరువాత ఇస్రో మరో ప్రయోగం, దీంతో పాటుగా కక్ష్యలోకి మ‌రో 13 క‌మ‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ల‌ు, నవంబర్ 25న అమెరికా నుంచి ప్రయోగం

నవంబర్ 25న కార్టోగ్రఫీ ఉపగ్రహం కార్టోశాట్-3(Cartosat-3)ని నింగిలోకి పంపనుంది. ఇందులో 13 కమర్షియల్ నానోశాటిలైట్‌(13 nanosatellites)లు కూడా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది.

India to launch Cartosat-3, 13 nanosatellites from US on November 25: Isro (Photo-pti and wikimedia)

Mumbai, November 19: చంద్రయాన్-2 ప్రయోగం తరువాత భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో (Indian Space Research Organisation) రెండు నెలల గ్యాప్‌లోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. నవంబర్ 25న కార్టోగ్రఫీ ఉపగ్రహం కార్టోశాట్-3(Cartosat-3)ని నింగిలోకి పంపనుంది. ఇందులో 13 కమర్షియల్ నానోశాటిలైట్‌(13 nanosatellites)లు కూడా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగిస్తున్న ఈ కార్టోశాట్-3 ఉపగ్రహం భారత్ నుంచి కాకుండా అమెరికా నుంచి ప్రయోగం నిర్వహించనుంది.ఈనెల 25వ తేదీన కార్టోశాట్-3 ఉప‌గ్ర‌హాన్ని (Cartosat-3 satellite), దాంతో పాటు మ‌రో 13 క‌మ‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ల‌ను క‌క్ష్య‌లోకి ప్రవేశ‌పెట్ట‌నున్నారు.

హై రెజ‌ల్యూష‌న్ ఇమేజింగ్ సామ‌ర్థ్యం ఉన్న ఉప‌గ్ర‌హంగా కార్టోశాట్‌-3ని రూపొందించారు. ఇది థార్డ్ జ‌న‌రేష‌న్‌కు చెందిన‌ది. ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా కార్టోశాట్‌-3ని నింగిలోకి ప్ర‌యోగిస్తారు. సుమారు 509 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న క‌క్ష్య‌లో కార్టోశాట్‌ను ఫిక్స్ చేయ‌నున్నారు. న‌వంబ‌ర్ 25వ(November 25) తేదీన ఉద‌యం 9.28 నిమిషాల‌కు ఈ ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ది. ఇటీవ‌ల న్యూస్పేస్ ఇండియాతో కుదిరిన ఒప్పందం నేప‌థ్యంలో.. అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్ల‌ను కూడా కార్టోశాట్‌తో నింగిలోకి పంప‌నున్నారు.

ఇస్రో విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనున్న పోలార్ శాటిలైల్ లాంచ్ వెహికల్-ఎక్స్‌ఎల్... కార్టోశాట్-3తో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను నవంబర్ 25 అమెరికాలోని లాంచ్‌ ప్యాడ్ నుంచి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. భారత కాలమాన ప్రకారం రాకెట్ ఉదయం 9గంటల 28 నిమిషాలకు టేకాఫ్ తీసుకోనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

ఉగ్రవాదుల కార్యకలాపాలు వారి శిబిరాలను కనుగొనేందుకు కార్టోశాట్-3 ఉపయోగపడుతుంది. మిలటరీ నిఘా కార్యక్రమాలకు ఈ ఉపగ్రహం ఎక్కువగా దోహదపడుతుంది. కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వంపులో 509 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెడతారు.స్పేస్ డిపార్ట్‌మెంట్ కింద కొత్తగా ఏర్పడిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ నానో శాటిలైట్లను రూపొందించింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif