Solar Eclipse 2019: ఆకాశంలో కనువిందు చేస్తున్న సూర్యగ్రహణం, ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం, సురక్షితమైన ఫిల్టర్లను ఉపయోగించే చూడాలంటున్న నిపుణులు, వివిధ ప్రాంతాల్లో సూర్యగ్రహణం చిత్రాలు

చంద్రుడు పూర్తిగా భూమికి మరియు సూర్యుడికి మధ్యలోకి వచ్చినపుడు చంద్రుడు ఉండే భాగం నీడలాగా కనిపించి దాని అంచులు సూర్యకాంతిలో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తాయి. .....

Solar eclipse 2019 pics (Photo Credits: ANI)

Hyderabad, December 26:  పదేళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం (Solar Eclipse) ఏర్పడనుంది. గురువారం ఉదయం 8:05 నిమిషాలకు సూర్యగ్రహణం మొదలైంది. 9:24 నుంచి పూర్తిస్థాయిలో ఇది కనిపించనుంది. ఈ సూర్యగ్రహణం వివిధ ప్రాంతాలను బట్టి 11:05 నుంచి 11:25 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఈ దృశ్యాన్ని స్పష్టంగా చూడవచ్చని చెబుతున్నారు. 2019 సంవత్సరానికి గానూ ఇదే ఆఖరు సూర్యగ్రహణం.

ఖగోళంలో అరుదుగా జరిగే ఇలాంటి అద్భుత సంఘటనలను చూడటానికి ఇష్టపడేవారికి ఇది ఒక గొప్ప అవకాశం. భూమికి మరియు సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు, దాని నీడ సూర్యునిపై పడుతుంది. దీనినే సాధారణంగా సూర్య గ్రహణం అని పిలుస్తారు.

ఇండియాతో పాటుగా మిడిల్ ఈస్ట్, యుఎఇ, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మరియు గువామ్ నుండి ప్రజలు ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ దృశ్యం స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో మరింత బాగా గమనించవచ్చని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.  ఈ సూర్యగ్రహణాన్ని ఆన్‌లైన్‌లో కూడా చూడవచ్చు, లైవ్ స్ట్రీమింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ అద్భుత ఘట్టాన్ని ఇప్పటికే కొంత మంది చిత్రాలు, వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

From Ahmedabad:

 

From Tamil Nadu

Tamil Nadu: Solar eclipse witnessed in Chennai pic.twitter.com/7cDz6NSgmc

— ANI (@ANI) December 26, 2019

సూర్యగ్రహణం జరిగే ఘట్టాన్ని "రింగ్ ఆఫ్ ఫైర్" అని కూడా చెప్తారు. చంద్రుడు పూర్తిగా భూమికి మరియు సూర్యుడికి మధ్యలోకి వచ్చినపుడు చంద్రుడు ఉండే భాగం నీడలాగా కనిపించి దాని అంచులు సూర్యకాంతిలో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తాయి. ఈ దృశ్యం ఆకాశంలో ఒక రింగ్ కు అగ్ని చుట్టినట్లుగా కనిపిస్తుంది, కనుక దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ (Ring of Fire) గా పిలుస్తారు.

Ring of Fire in Dubai

అయితే సూర్య గ్రహణాన్ని నేరుగా చూడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేరుగా చూస్తే అది కంటి చూపుపై ప్రభావం చూపుతుంది, కాబట్టి ప్రత్యేక ఫిల్టర్లను ఉపయోగించి మాత్రమే చూడాలంటున్నారు. బైనాక్యూలర్లతో ఎట్టి పరిస్థితుల్లో చూడవద్దని చెబుతున్నారు. 14 నెంబర్ వెల్డర్ కళ్లద్దాలు, పాలిమర్ కోటెడ్ ఫిల్మ్ లు, ఇతర ఫిల్టర్లతో చూస్తూ సూర్యగ్రహణాన్ని ఆస్వాదించవచ్చు.

PM Modi Tweet:

ఇక మబ్బుల కారణంగా తాను ఈరోజు సంభవించిన సూర్య గ్రహణాన్ని వీక్షించలేకపోయానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.