Tech Layoffs: టెక్ ఉద్యోగుల్లో మొదలైన కలవరం, టాప్ కంపెనీల నుంచి 50 వేలకు పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు, కొత్త నియామకాలు అవుట్

2024లో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే కంపెనీల ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంతో ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది కూడా మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Layoffs Representative Image (Photo Credit: Pixabay)

2023 లో వేలాది మంది ఉద్యోగులను రోడ్డు మీదకు తీసుకువచ్చాయి టాప్ టెక్ కంపెనీలు. 2024లో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే కంపెనీల ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంతో ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది కూడా మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వెల్లడైన 2023-24 మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలలో టీసీఎస్, హెచ్‌సీఎల్‌ సంస్థలు స్వల్ప లాభాలను పొందగా.. విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మాత్రం నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉద్యోగుల మీద కూడా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఏడాది ఆరంభంలోనే మొదలైన లేఅప్స్, 125 మంది ఉద్యోగులను తొలగిస్తున్న InMobi

ఈ ఏడాది ప్రారంభంలోనే గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం ఇప్పటికే ప్రారంభించాయి. 2023-24 మూడవ త్రైమాసికం నాటికి భారతదేశంలోని టాప్ 4 కంపెనీలలో ఉద్యోగుల సంఖ్య 50,875 తగ్గినట్లు సమాచారం. ఇందులో 10,669 మంది టీసీఎస్, 24182 మంది ఇన్ఫోసిస్, 18510 మంది విప్రో, 2486 మంది హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులు ఉన్నారు.

ఇదిలా ఉంటే ఐటీ కంపెనీలు కొత్త నియామకాలను చేపట్టలేదు. రాబోయే రోజుల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను ప్రారంభించే దిశగా టీసీఎస్ యోచిస్తోంది. ఇన్ఫోసిస్ మాత్రం ఇప్పట్లో ఇంటర్వ్యూలు నిర్వహించే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. హెచ్‌సీఎల్ కంపెనీ మాత్రం ఫ్రెషర్లను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.