Twitter Layoffs: ట్విట్టర్‌లో మరోసారి కోతలు, ఒకే టీమ్‌ను టార్గెట్ చేసి తొలగించిన ఎలాన్ మస్క్, తాజా లే ఆఫ్స్‌పై సోషల్ మీడియాలో చర్చ
ట్విట్టర్ హస్తగతం చేసుకున్న మొదట్లోనే భారీగా ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్... మరోసారి లే ఆఫ్స్ పై దృష్టిపెట్టారు. శుక్రవారం నాడు దాదాపు డజనుకు పైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. గ్లోబల్ కంటెంట్ మోడరేషన్ ను హ్యాండిల్ చేస్తున్న ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ కు చెందిన పలువురు కీలకమైన ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి
Washington, JAN 08: ట్విట్టర్ లో (Twitter) మరోసారి కోతలు మొదలయ్యాయి. ట్విట్టర్ హస్తగతం చేసుకున్న మొదట్లోనే భారీగా ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్(Elon Musk)... మరోసారి లే ఆఫ్స్ పై (lay offs) దృష్టిపెట్టారు. శుక్రవారం నాడు దాదాపు డజనుకు పైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. గ్లోబల్ కంటెంట్ మోడరేషన్ ను హ్యాండిల్ చేస్తున్న ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్ కు (Trust And Safety Team) చెందిన పలువురు కీలకమైన ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్వాసనకు గురైన ఉద్యోగులంతా ట్విట్టర్ లో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తొలగింపునకు గురైన వారిలో ఇటీవలే ఉద్యోగంలో చేరిన వాళ్లు కూడా ఉన్నారు.
ఆసియా- పసిఫిక్ రీజియన్ ఇంటిగ్రెటీ సైట్ హెడ్ కూడా ఉద్యోగం నుంచి తొలగించిన వారిలో ఉన్నారు. అయితే ఉద్యోగాల కోత ఎందుకనేది మాత్రం ట్విట్టర్ ప్రకటించలేదు. ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగానికి చెందినవారినే తొలగించడంతో...దీని వెనుక కారణం ఏంటనేది అంతుచిక్కడం లేదు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.