Vikram Lander Details: చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి కీలక ఫొటోలు విడుదల, విక్రమ్ ల్యాండ్ అయిన ప్రదేశం ఇదేనంటున్న నాసా, చిత్రాలను బంధించిన నాసా ఎల్‌ఆర్‌వోసీ, సూర్యుడిపై ఫోకస్ పెడుతున్న ఇస్రో

విక్రమ్ ల్యాండింగ్ కోసం ముందుగా నిర్ధేశించిన ప్రాంత ఫొటోలను నాసాకు చెందిన ఎల్ఆర్వో(లూనార్ రెకొనైసెన్స్ ఆర్బిటర్) తీసింది.

Vikram lander hidden by shadow of Moon, claims Nasa (PHOTO -TWITTER)

September 27: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్‌ 2’(chandryaan 2)లోని విక్రమ్ ల్యాండింగ్‌కు సంబంధించిన కీలక ఫోటోలను నాసా విడుదల చేసింది. విక్రమ్ ల్యాండింగ్ కోసం ముందుగా నిర్ధేశించిన ప్రాంత ఫొటోలను నాసాకు చెందిన ఎల్ఆర్వో(లూనార్ రెకొనైసెన్స్ ఆర్బిటర్) తీసింది. సెప్టెంబర్ 17న ఈ ఫొటోలను తీయగా నాసా వాటిని తాజాగా విడుదల చేసింది. రాత్రి సమయంలో తీయడం వలన విక్రమ్ ల్యాండర్ ఎక్కడ లొకేట్ అయ్యిందో గుర్తించలేకపోతున్నామని నాసా ప్రకటించింది.  నాసాకు చెందిన లునార్‌ రికనైజాన్స్‌ ఆర్బిటర్‌ కెమెరా (ఎల్‌ఆర్‌వోసీ) చంద్రుడి సమీపంలో తిరుగుతున్న సమయంలో ఈ ఫొటోలను తీసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో చంద్రయాన్‌-2ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయాలని ఇస్రో భావించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్‌-2 నుంచి వేరయిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై హార్డ్‌ ల్యాండింగ్‌ చేసిందని పేర్కొంటూ.. అది హార్డ్‌ ల్యాండ్‌ అయిన ప్రదేశానికి సంబంధించిన హై-రిజల్యూషన్‌ ఫొటోలను నాసా విడుదల చేసింది.

నాసా ట్వీట్

చంద్రయాన్-2‌లో భాగమైన విక్రమ్ ల్యాండర్ సెప్టెంబర్ 6న అర్థరాత్రి సమయంలో 1.40కి చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిందని. అయితే అక్కడ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా హార్డ్ ల్యాండింగ్ అవ్వడం వల్ల అది ఎక్కడ పడిందో కూడా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ కనిపెట్టలేకపోయామని నాసా తెలిపింది. కాగా 14 రోజులు పనిచేసే విక్రమ్‌కి డెడ్‌లైన్ ముగిసిన సంగతి విదితమే. విక్రమ్ ల్యాండర్ కూలిన ప్రదేశంలో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అక్కడ నీడలు ఎక్కువగా పడుతున్నాయి. అందువల్ల కచ్చితంగా విక్రమ్ ఎక్కడుందో తెలియట్లేదని నాసా తెలిపింది. ప్రస్తుతం ల్యాండర్ కూలిన చోట వెలుతురు లేదు కాబట్టి అక్టోబర్‌లో మళ్లీ సూర్యకాంతి పడినప్పుడు LRO ద్వారా వెతికిస్తామని ఇస్రో తన తెలిపింది.

చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దానితో తిరిగి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. ఆ ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం శనివారం ఉదయంతో ముగిసిపోయింది. చంద్రుడిపై పగటివేళ 130 డిగ్రీల సెల్రియస్‌ ఉష్ణోగ్రతలు ఉండగా.. రాత్రి వేళ దాదాపు మైనస్‌ 200 డిగ్రీలకు అక్కడి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. విక్రమ్‌ ల్యాండర్‌.. అందులోని రోవర్‌ ఇంతటి చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. గగన్‌యాన్ ద్వారా అంతరిక్షంలోకి తొలి భారతీయుడు

విక్రమ్ ల్యాండర్ విషయంలో ఏం జరిగిందో విశ్లేషించేందుకు ఓ జాతీయ స్థాయి కమిటీని వేసినట్లు ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా... భవిష్యత్ ప్లాన్ ఉంటున్నారు. ఇందుకోసం కొన్ని తప్పనిసరి అనుమతులు, ఇతర ప్రక్రియ ఉంటుందన్నారు. దీనిపై తాము దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇస్రో... గగన్‌యాన్ మిషన్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఎందుకంటే... వచ్చే ఏడాది గగన్‌యాన్ ద్వారా ఇస్రో ముగ్గురు భారతీయ వ్యోమగాములను రోదశిలోకి పంపబోతోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1000 కోట్లు అవుతాయని అంచనా.

కొత్త ప్రాజెక్ట్ మీద ఫోకస్

ఇస్రో తదుపరి ప్రయోగాలపై ఫోకస్ పెట్టిందని, సూర్యగ్రహంపై ప్రయోగాలు చేసేందుకు అంతరిక్షానికి భారత అంతరిక్ష నౌకలో మనుషులను పంపునున్నట్టు చెప్పారు. చిన్న శాటిలైట్లను లాంచ్ చేసేందుకు ఒక రాకెట్ పై కూడా ఇస్రో పనిచేస్తున్నట్టు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif