WhatsApp Pink Scam: ఇలాంటి లింక్ మీకు కూడా వచ్చిందా? అది క్లిక్ చేస్తే అంతే సంగతులు, పింక్ వాట్సాప్ వాడేవారు డేంజర్‌లో పడ్డట్లే, మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు వాళ్ల చేతుల్లోకి...
ఈ ప్లాట్‌ఫారమ్‌తో లింక్ చేసిన కొత్త స్కామ్ గురించి అధికారులను హెచ్చరించారు. లింక్‌పై క్లిక్ చేయవద్దని లేదా యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు
Mumbai, June 28: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ అకౌంట్‌కు ఎప్పుడైనా ఇలాంటి లింకులు వచ్చాయా? తస్మాత్ జాగ్రత్త.. ఇటీవలే వాట్సాప్‌లో కొత్త మెసేజ్ వైరల్ అవుతుంది. అందులోని యూజర్లు ‘Pink Whatsapp‘ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్‌ను స్వీకరిస్తున్నారు. ఈ స్కామర్లు ఈ లింక్‌ను చాలా మందికి పంపుతున్నారు. సరికొత్త ఫీచర్లతో యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని అడుగుతున్నారు. ఇటీవల పబ్లిక్ అడ్వైజరీలో ముంబై పోలీసులు ‘Pink Whatsapp‘ అనే వైరల్ వాట్సాప్ మెసేజ్ గురించి అడ్వైజరీ జారీ చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్‌తో లింక్ చేసిన కొత్త స్కామ్ గురించి అధికారులను హెచ్చరించారు. లింక్‌పై క్లిక్ చేయవద్దని లేదా యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు. ‘న్యూ పింక్ లుక్ వాట్సాప్‌కి సంబంధించిన అదనపు ఫీచర్లతో వాట్సాప్‌కు సంబంధించిన వార్తలు ఇటీవల వాట్సాప్ ప్లాట్‌ఫారంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ లింకు వార్తలను లింక్ చేస్తే.. డేంజరస్ సాఫ్ట్‌వేర్ ద్వారా మొబైల్‌ను హ్యాకింగ్‌కు దారితీస్తోంది. సైబర్ మోసగాళ్లు యూజర్లను వారి ట్రాప్‌లో పడేలా వివిధ రకాల కొత్త మార్గాలను ప్రయత్నిస్తున్నారు. ఈ రకమైన మోసాల పట్ల వాట్సాప్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలి.
ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాట్సాప్‌లో (WhatsApp) మోసపూరిత మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లోని లోగో కలర్ మార్చే అప్‌డేట్‌ను అందిస్తున్నట్లు మెసేజ్పేర్కొంది. అదనంగా, వాట్సాప్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లను అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. అయితే, ఆ లింక్ ఫిషింగ్ లింక్.. దానిపై క్లిక్ చేస్తే యూజర్ ఫోన్ స్కామర్ల కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. స్కామర్‌కు డివైజ్ రిమోట్ కంట్రోల్ ఇవ్వడం జరుగుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వాట్సాప్ ఫేక్ లింక్‌పై (WhatsApp Link) క్లిక్ చేసిన యూజర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ముంబై పోలీసులు హెచ్చరిస్తున్నారు. యూజర్ల కాంటాక్టు నంబర్లు, సేవ్ చేసిన ఫొటోలను అనధికారికంగా ఉపయోగించరాదు. తద్వారా మీ విలువైన నగదును కోల్పోయే అవకాశం ఉంది. లేదంటే.. మొబైల్ డివైజ్‌లపై కంట్రోల్ పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది.
వాట్సాప్ వినియోగదారులు వైరల్ పింక్ వాట్సాప్ స్కామ్ బారిన పడకుండా ఎలా నిరోధించవచ్చో పోలీసులు అనేక సూచనలు చేస్తున్నారు. అన్నింటిలో మొదటిది.. మీరు మీ మొబైల్‌లో ఫేక్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఉంటే వెంటనే దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. అన్‌ఇన్‌స్టాల్ చేసేందుకు Settings> Apps > WhatsApp (Pink Logo)కి నావిగేట్ చేసి Uninstall చేయండి. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.