WhatsApp: యూజర్లకు వాట్సాప్ షాక్, నవంబర్ నుంచి కొన్ని ఫోన్లకు సేవలు నిలిపివేత, శాంసంగ్, ఎల్‌జీ, ఎల్‌టీఈ, హువాయ్, సోనీ, అల్కాటెల్ ఇంకా ఇతర ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నామని వెల్లడి
వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకుపోతోంది. అయితే వాట్సప్ కూడా కొన్ని ఫోన్లకు పరిమితులు విధించింది. 2021 తర్వాత కొన్ని ఫోన్లలో వాట్సప్ సేవల నిలిపివేస్తున్నామని కంపెనీ ప్రకటించింది. కొన్ని రకాల ఆండ్రాయిడ్, ఐఫోన్లకు వాట్సప్ సేవలు నిలిపివేస్తున్నామని (WhatsApp Will Stop Working) యూజర్లు ఈ విషయం గమనించాలని కోరింది.
వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకుపోతోంది. అయితే వాట్సప్ కూడా కొన్ని ఫోన్లకు పరిమితులు విధించింది. 2021 తర్వాత కొన్ని ఫోన్లలో వాట్సప్ సేవల నిలిపివేస్తున్నామని కంపెనీ ప్రకటించింది. కొన్ని రకాల ఆండ్రాయిడ్, ఐఫోన్లకు వాట్సప్ సేవలు నిలిపివేస్తున్నామని (WhatsApp Will Stop Working) యూజర్లు ఈ విషయం గమనించాలని కోరింది. తాజాగా నవంబర్ 1, 2021 నుంచి ఏ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదో.. ఆ స్మార్ట్‌ఫోన్ల లిస్ట్‌ను వాట్సప్ ప్రకటించింది.
ఆండ్రాయిడ్ 4.0.3 లేదా అంతకన్నా తక్కువ వర్షన్ ఓఎస్‌ను ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఓఎస్ 9 లేదా అంతకన్నా తక్కువ వర్షన్ ఓఎస్‌ను ఉపయోగిస్తున్న యాపిల్ ఐఫోన్లలో వాట్సప్ తన సేవలను నిలిపివేయనుంది. అంటే.. ఆయా ఫోన్లలో వాట్సప్ పనిచేస్తుంది కానీ.. వాట్సప్‌కు సంబంధించిన అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్, కొత్త ఫీచర్లు మాత్రం అందుబాటులో ఉండవు.
వాట్సప్ రిలీజ్ చేసిన లిస్టులో శాంసంగ్, ఎల్‌జీ, ఎల్‌టీఈ, హువాయ్, సోనీ, అల్కాటెల్.. ఇంకా కొన్ని ఇతర బ్రాండ్స్ ఉన్నాయి. అలాగే.. ఐఫోన్లలో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6ఎస్‌లో వాట్సప్ పనిచేయదు.
వాట్సాప్ పనిచేయని ఫోన్ల లిస్ట్ ఇదే..
శాంసంగ్: Samsung Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core, and Galaxy Ace 2 ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.
ఎల్‌జీ: LGs Lucid 2, LG Optimus F7, LG Optimus F5, Optimus L3 II Dual, Optimus F5, Optimus L5, Optimus L5 II, Optimus L5 Dual, Optimus L3 II, Optimus L7, Optimus L7 II Dual, Optimus L7 II, Optimus F6, Enact , Optimus L4 II Dual, Optimus F3, Optimus L4 II, Optimus L2 II, Optimus Nitro HD and 4X HD, and Optimus F3Q ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి.
జెడ్‌టీఈ: ZTE Grand S Flex, ZTE V956, Grand X Quad V987, and ZTE Grand Memo ఫోన్లలో వాట్సప్ నిలిచిపోనుంది.
హువాయ్ : Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S, and Ascend D2 ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.
సోనీ: Xperia Miro, Sony Xperia Neo L, and Xperia Arc S ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)