YouTube: క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్, 500 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉంటే మానిటైజేషన్‌, వాచ్‌ అవర్స్‌ కూడా 3వేలు గంటలకు తగ్గింపు

పేమెంట్‌ చాట్, టిప్పింగ్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, షాపింగ్ ఫీచర్‌లతో సహా షార్ట్ వీడియో క్రియేటర్లకు మానిటైజేషన్‌లో కొత్త విధానాన్ని లాంచ్‌ చేసింది

YouTube (Photo Credits : Facebook)

వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌ క్రియేటర్లకు శుభవార్తను అందించింది. పేమెంట్‌ చాట్, టిప్పింగ్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, షాపింగ్ ఫీచర్‌లతో సహా షార్ట్ వీడియో క్రియేటర్లకు మానిటైజేషన్‌లో కొత్త విధానాన్ని లాంచ్‌ చేసింది. సవరించిన విధానం ప్రకారం, క్రియేటర్‌లు ఇప్పుడు 500 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉంటే యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రొగ్రామ్’(వైపీపీ)లో చేరిపోవచ్చు. ఇప్పటిదాకా వెయ్యి సబ్‌స్క్రైబర్‌లు ఉంటే తప్ప ఈ అవకాశం లభించేది కాదు.

అంతేకాదు గతంలో 4,000 గంటలు వాచ్‌ హవర్స్‌, 10 మిలియన్లతో పోలిస్తే ఇపుడు మూడు మిలియన్ల వ్యూస్‌ లేదా 3వేలు గంటల వాచ్‌ అవర్స్‌ ఉంటే సరిపోతుంది. క్రియేటర్లకు మానిటైజేషన్ అవకాశాలను విస్తరించాలనే యూట్యూబ్‌ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా షార్ట్స్ మానిటైజేషన్ మాడ్యూల్ నిబంధనలను బట్టి షార్ట్ వీడియోల మధ్యలో వచ్చేయాడ్‌ వాచ్ టైమ్‌ను బట్టి ఇన్‌కమ్ జనరేట్ అవుతుందనేది తెలిసిన సంగతే.

ఆధార్ వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ! ఎవరెవరు ఉచితంగా మార్చుకోవచ్చు, ఎలా అప్‌ డేట్ చేసుకోవాలంటే?

ఈ నిబంధనలు ప్రస్తుతం యూఎస్‌, యూకే, కెనడా, తైవాన్,దక్షిణ కొరియాలో అందుబాటులోకి వస్తాయని ది వెర్జ్‌ నివేదించింది. ఇతర ప్రదేశాలలో కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నప్పటికీ భారత్‌లో ఈ నిబంధన ఎప్పటినుంచి వర్తించేది స్పష్టత లేదు.

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif