Susan Wojcicki: యూట్యూబ్ మాజీ సీఈవో కన్నుమూత, రెండేళ్ల పాటూ క్యాన్సర్ తో పోరాడి మరణించిన సుసాన్ వొజ్కికి, ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టమంటూ పిచాయ్ ట్వీట్
ఆమె మరణ వార్తను ఆమె భర్త 'డెన్నిస్ ట్రోపర్' ఆగస్టు 9న ధృవీకరించారు. సుసాన్ వొజ్కికి మరణ వార్తను ట్రోపర్ ఫేస్‌బుక్ పోస్ట్‌తో తెలియజేశారు. నా భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి చివరకు కన్నుమూసింది.
Washington, AUG 10: యూట్యూబ్ మాజీ సీఈఓ 'సుసాన్ వొజ్కికి' (Susan Wojcicki) క్యాన్సర్‌తో రెండేళ్ల పోరాటం తర్వాత 56 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె మరణ వార్తను ఆమె భర్త 'డెన్నిస్ ట్రోపర్' ఆగస్టు 9న ధృవీకరించారు. సుసాన్ వొజ్కికి మరణ వార్తను ట్రోపర్ ఫేస్‌బుక్ పోస్ట్‌తో తెలియజేశారు. నా భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి చివరకు కన్నుమూసింది. సుసాన్ నాకు ప్రాణ స్నేహితురాలు. జీవిత భాగస్వామి మాత్రమే కాదు, తెలివైన మనస్సు, ప్రేమగల తల్లి, చాలా మందికి మంచి స్నేహితురాలు. మా కుటుంబంపై ఆమె ప్రభావం ఎనలేనిదని అన్నారు.
సుసాన్ వొజ్కికి మరణం టెక్ ప్రపంచానికి తీరని లోటు అని చాలామంది నివాళులు అర్పించారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్యాన్సర్‌తో పోరాడి నా ప్రియమైన స్నేహితురాలు సుసాన్ వొజ్కికిని (Susan Wojcicki) కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టంగా ఉందని అన్నారు.