Nepal Floods: భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలం, రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య, మూడు రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు
కొండ చరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 192 మంది మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. వరదల్లో చిక్కుకున్న 4,500 మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు.
Hyd, Sep 30: భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతమైంది. కొండ చరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 192 మంది మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. వరదల్లో చిక్కుకున్న 4,500 మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు.
భారీ వర్షాల కారణంగా ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. దెబ్బతిన్న పాఠశాల భవనాలు మరమ్మతు చేయాల్సిన అవసరం ఉండగా, వరద ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.
గత 45 ఏళ్లల్లో ఇలాంటి స్థాయి వరదలు ఎన్నడూ చూడలేదని నేపాల్ అధికారులు వెల్లడించారు. బస్సులు, వాహనాలు, ఇళ్లపై కొండ చరియలు విరిగిపడి, శిథిలాల కింద చిక్కుకుని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 20 వేల మందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశంలో అద్భుతం 10 వేల డ్రోన్ల ప్రదర్శన.. చైనా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రేషన్ .. రెండు గిన్నిస్ రికార్డులు (వీడియో)
Here's Tweet:
మోకాలి ఎత్తులో బురద ఉండటంతో బురదను తొలగించడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. మక్వాన్‌పూర్‌లో ఆల్ నేపాల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రం వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు చనిపోయారు.
కాఠ్‌మాండూలో భారీ వర్షాల కారణంగా బాగ్మతి నది పొంగిపొర్లుతుండగా వరదల వల్ల వాటర్‌పైపులు పగిలిపోయాయి. ప్రజలు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.