Sperm Donor Fathers Over 60 Kids: వీర్యం దానం చేసుకుంటూ 60 మంది పిల్లలకు తండ్రయ్యాడు, పిల్లలంతా ఒకే విధంగా ఉండటంతో షాక్ తిన్న తల్లిదండ్రులు, ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన
అయితే వీర్య కణాలు దానం((sperm donation) చేసిన ఆ వ్యక్తి పేరును అధికారులు బయటపెట్టలేదు.
ఆస్ట్రేలియాలో 60 మంది చిన్నారులకు తండ్రి ఒక్కడేనంటూ (Sperm Donor Fathers Over 60 Kids) షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అయితే వీర్య కణాలు దానం((sperm donation) చేసిన ఆ వ్యక్తి పేరును అధికారులు బయటపెట్టలేదు. ఇండిపెండెంట్ మీడియా కథనం ప్రకారం..ఎల్జీబీటీ వర్గానికి చెందిన పేరెంట్స్ అందరూ ఓ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకున్నారు. అయితే అక్కడకు పిల్లలతో పేరెంట్స్ రాగా అక్కడకు వచ్చిన పిల్లలు అందరూ దాదాపు సేమ్‌గా కనిపించారు. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.
అన్ని సెంటర్లలో వీర్య కణాలు డోనేట్ చేసన వ్యక్తి ఒక్కడే (Australian Sperm Donor) అని తెలిసింది. నాలుగు పేర్లతో అతను తన వీర్య కణాలను దానం చేసినట్లు గుర్తించారు. ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం స్పెర్మ్ డోనేషన్ నేరం. గిఫ్ట్‌లు తీసుకుని వీర్య కణాల ఇవ్వడం కూడా నిషేధం. అక్రమ పద్ధతిలో వీర్య కణాలను డోనేట్ చేయడం వల్ల అతనికి 15 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు లేని వారు నేరుగా డోనార్‌ను కలవడం వల్ల అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.