Bahamas Boat Capsized: పొట్టకూటి కోసం వెళుతూ 17 మంది మృతి, హైతీ వలసదారులతో అక్రమంగా ప్రయాణిస్తున్న పడవ బోల్తా

ఈ దుర్ఘటనలో 17మంది హైతీ వలసదారులు మరణించారు. బహామియన్ భద్రతా దళాలు 17 మృతదేహాలను వెలికితీశాయి. పడవలో ఉన్న 25 మందిని రక్షించినట్లు హైతీ అధికారులు తెలిపారు.న్యూ ప్రొవిడెన్స్ నుంచి ఏడు మైళ్ల దూరంలో పడవ మునిగిపోయింది.

Bahamas boat capsized (Photo-ANI)

బహామాస్ సముద్రంలో హైతీ వలసదారులతో అక్రమంగా ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 17మంది హైతీ వలసదారులు మరణించారు. బహామియన్ భద్రతా దళాలు 17 మృతదేహాలను వెలికితీశాయి. పడవలో ఉన్న 25 మందిని రక్షించినట్లు హైతీ అధికారులు తెలిపారు.న్యూ ప్రొవిడెన్స్ నుంచి ఏడు మైళ్ల దూరంలో పడవ మునిగిపోయింది. మృతుల్లో 15 మంది మహిళలు, ఒక పురుషుడు, ఒక పసిపాప ఉన్నారని ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమంగా వలసదారుల స్మగ్లింగ్ ఆపరేషన్‌పై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించినట్లు డేవిస్ చెప్పారు. పొద్దు పొద్దున్నే ఘెర రోడ్డు ప్రమాదం, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న రెండు బస్సులు, 8 మంది మృతి, సీఎం యోగీ సంతాపం

ఇదిలా ఉంటే గత జులైలో హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యకు గురైన ఒక సంవత్సరం తర్వాత దేశంలో హింస మరింత పెరిగింది.దీంతో హైతీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ నేపథ్యంలోనే మెరుగైన జీవనాన్ని వెతుక్కుంటూ చాలామంది దేశం విడిచి వెళుతున్నారు.