China: అక్కడ పిల్లల్ని కంటే రూ. 23 లక్షలు బ్యాంక్ లోన్, ఇద్దరు పిల్లల్ని కంటే అత్యంత తక్కువ వడ్డీ రేటు, చైనా జిలిన్‌ ప్రావిన్స్‌‌లో పెళ్లికి, పిల్లలకు ప్రత్యేక రుణాలు ఇస్తున్న బ్యాంకులు

ఇప్పటిదాకా ఇల్లు కట్టుకోవటానికి, బైక్ కొనుక్కోవటానికి, కార్లు కొనుక్కోవటానికి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. అయితే చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్‌ ప్రావిన్స్‌ (Jilin province) వివాహం చేసుకోవడానికి, పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రుణాలను అందజేస్తోంది. అంతే కాకుండా ఇచ్చే బ్యాంకులకు ప్రభుత్వం మద్దతు కూడా ఇస్తోంది.

China: అక్కడ పిల్లల్ని కంటే రూ. 23 లక్షలు బ్యాంక్ లోన్, ఇద్దరు పిల్లల్ని కంటే అత్యంత తక్కువ వడ్డీ రేటు, చైనా జిలిన్‌ ప్రావిన్స్‌‌లో పెళ్లికి, పిల్లలకు ప్రత్యేక రుణాలు ఇస్తున్న బ్యాంకులు
China couple(Pic Credit: Pixabay )

Jilin province, Dec 24: ఇప్పటిదాకా ఇల్లు కట్టుకోవటానికి, బైక్ కొనుక్కోవటానికి, కార్లు కొనుక్కోవటానికి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. అయితే చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్‌ ప్రావిన్స్‌ (Jilin province) వివాహం చేసుకోవడానికి, పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రుణాలను అందజేస్తోంది. అంతే కాకుండా ఇచ్చే బ్యాంకులకు ప్రభుత్వం మద్దతు కూడా ఇస్తోంది. బ్యాంకులు ఇచ్చే రుణాల్లో (marriage and birth consumer loans) పిల్లల్ని కనే సంఖ్యను బట్టి కూడా వడ్డీ ఉంటుంది. ఎక్కువమంది పిల్లల్ని కంటే తక్కువ వడ్డీకే బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. 200,000 yuan మన కరెన్సీలో దాదాపు రూ.23 లక్షలు వరకు రుణాలు ఇచ్చేలా అక్కడి ప్రభుత్వం బ్యాంకులకు మద్దతు ఇచ్చింది.

దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. కొంతమంది జనాభా శాస్త్రవేత్తలు జిలిన్‌ ప్రావిన్స్‌లో (Chinese Jilin province) జనాభా ఇప్పటికే తగ్గిపోవచ్చని అంచనా వేశారు. దీంతో జిలిన్‌ ప్రావిన్స్‌ జనాభా పెరుదలను ప్రోత్సహించే చర్యలు ( population slides) చేపట్టింది. అంతేకాదు ఆ చర్యల్లో భాగంగా ఇతర ప్రావిన్స్‌ల నుండి జంటలు నివాసం పొందేందుకు అనుమతిచ్చింది. అయితే ఇలా అనుమతి పొందడాన్ని అక్కడ హుకౌ అని పిలుస్తారు. పైగా వారికి పిల్లలు ఉంటే వారు పబ్లిక్‌ సేవలు పొందేలా నమోదు చేసుకోవడం వంటి వెసులుబాటు కల్పించింది.

మళ్లీ ఇంకొకటి, డెల్‌మిక్రాన్ అంటే ఏమిటి, కొత్త వేరియంట్ వల్ల ప్రమాదం ఎంత, నిపుణులు దీనిపై ఏమంటున్నారు, Delmicron, Diamicron రెండూ ఒకటేనా?

ఈ మేరకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్న జంటలు చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంటే వారికి పన్ను రాయితీలు కూడా కల్పిస్తోంది. అయితే జిలిన్ ప్రావిన్స్‌ చైనా"రస్ట్ బెల్ట్" ప్రాంతంలోని భాగం. ఈ ప్రాంతం వ్యవసాయ పరంగా బాగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ప్రావిన్స్‌ గత కొన్ని సంవత్సరాలుగా అధ్వానమైన జనాభా క్షీణత, ఆర్థికవృద్ధిలో మందగమనాన్ని చవి చూసింది. జిలిన్ ప్రావిన్స్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలలో 2020లో అదే కాలం నుండి 7.8% విస్తరించింది, ఇది జాతీయ సగటు 9.8% కంటే నెమ్మదిగా ఉంది.

అంతేకాదు ఇతర ప్రావిన్సుల మాదిరిగానే, జిలిన్ కూడా ప్రసూతి, పితృత్వ సెలవులను పొడిగించింది. మహిళలకు మొత్తం 180 రోజుల సెలవు ఉంటుంది, ఇది మునుపు 158 రోజులగా ఉండేది. పురుషులకు 15 రోజుల నుండి 25 రోజుల వరకు ఉంటుంది. దంపతులు ప్రతి సంవత్సరం తమ పిల్లలకు మూడు సంవత్సరాలు వచ్చే ముందు ప్రతి సంవత్సరం 20 రోజుల పేరెంటల్ లీవ్‌ను పొందుతారని పత్రం పేర్కొంది. ఈ పత్రం ప్రకారం, రెండు, మూడు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు డేకేర్ ఏర్పాటు చేయడానికి కిండర్ గార్టెన్‌లను ప్రోవిన్స్ ప్రోత్సహిస్తుంది.

ఒమిక్రాన్ దడ, దేశంలో 2022 ఫిబ్రవరి 3 నాటికి థర్డ్ వేవ్ తప్పదంటున్న నిపుణులు, భారత్ లో 300కి చేరువలో కొత్త వేరియంట్ కేసులు

అయితే ఈ ఏడాది ప్రారంభంలో జియాంగ్జీలోని ఆగ్నేయ ప్రావిన్స్‌లోని బ్యాంక్ ఆఫ్ చైనా బ్రాంచ్ బిడ్డను కలిగి ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకుని రుణాలను ప్రోత్సహించడంపై విస్తృత విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత బ్యాంకు ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేదని భావించి ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నట్లు స్థానిక మీడియాకి తెలిపింది.

ఇదిలా ఉంటే గతంలో జనాభా పెరిగిపోతుందని గగ్గోలు పెట్టిన చైనా ఒక్క పిల్లాడ్ని మాత్రమే కనాలని షరతు పెట్టింది. అది వర్కవుట్ కాకపోవడంతో ఇద్దర్ని కనవచ్చంటూ తెలిపింద. అయితే చైనా యువత మాత్రం పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో దేశంలో జనాభా విపరీతంగా తగ్గిపోయింది. వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం బ్యాంకులకు ఈ విషయంలో మద్దతుగా నిలుస్తోంది.. అయితే ప్రభుత్వం ఏవిధంగా సహాయాన్ని అందజేస్తుందనే దానిపై ఇంకా ఎలాంటి వివరాలు లేవు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం..కేజీ చికెన్ రూ. 100 మాత్రమే...బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ వండాల్సిన టిప్స్ ఇవే..ఈ పద్ధతుల్లో చికెన్ వండితే బర్డ్ ఫ్లూ రాదు..

Health Tips: రక్తం తగ్గిపోయిందని భయపడుతున్నారా..అయితే టాబ్లెట్లతో కాదు...ఈ ఫుడ్స్ తింటే మీ బాడీలో రక్తం ఉరకలు పెడుతుంది..బ్లడ్ బాగా శరీరానికి పడుతుంది..

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు నెయ్యి అస్సలు తినకూడదు..తింటే ఆసుపత్రిపాలు కావడం ఖాయం... ప్రాణాపాయం సైతం సంభవించే అవకాశం...

Vallabhaneni Vamsi Mohan Arrest: డీజీపీ అప్పాయింట్‌మెంట్ ఇస్తే వచ్చాం, అయినా కలవకుండా వెళ్లిపోయారు, తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన అంబటి రాంబాబు

Share Us