COVID 3rd Wave: ఒమిక్రాన్ దడ, దేశంలో 2022 ఫిబ్రవరి 3 నాటికి థర్డ్ వేవ్ తప్పదంటున్న నిపుణులు, భారత్ లో 300కి చేరువలో కొత్త వేరియంట్ కేసులు
IIT-Kanpur. (Photo Credits: ANI)

New Delhi, December 23: ప్రపంచ వ్యాప్తంగా కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. దాదాపు అన్ని దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ భారత్ లో వణుకు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు మరొక షాకింగ్ న్యూస్ బయటకు తీసుకువచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి దేశంలో ఒమిక్రాన్ కేసులు (Which May Be Triggered by Omicron Variant) భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. 2022 ఫిబ్రవరి 3 నాటికి ఒమిక్రాన్ మూలంగా దేశంలో కరోనా ధర్డ్ వేవ్ (COVID 3rd Wave) వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

online preprint health server MedRxiv లో పబ్లిష్ అయిన కథనం ప్రకారం.. డిసెంబర్ మధ్య వారం నుంచి కేసుల పెరుగుదత నమోదై అది 2022 ఫిబ్రవరి నాటికి ( Peak in February 2022) పీక్ స్టేజికి చేరుకుంటుందని తెలిపింది. అన్నట్లుగానే దేశంలో డిసెంబర్ నుంచి ఒమిక్రాన్ కేసుల్లో పెరుగుదల నమోదవుతూ వస్తోంది. ఈ రిపోర్టులో వారు కరోనావైరస్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ డాటాను పరిగణలోకి తీసుకున్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులను అంచనావేసిన రీసెర్చర్లు దేశంలో థర్డ్ వేవ్ తప్పదని తెలిపారు.

మళ్లీ రాత్రి కర్ఫ్యూ అమల్లోకి, 14 రోజుల పాటు ఆంక్షలు విధించాలని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపు

కరోనా వైరస్ నమోదైన తొలి రోజు నుంచి కేవలం 735 రోజుల్లోనే అది దేశంలో భారీగా వ్యాప్తి చెందింది. కేసులు భారీగా పెరిగాయి. ఇప్పుడు డిసెంబర్ 15 నుంచి దేశంలో ఒమిక్రాన్ కేసులు ప్రారంభమయ్యాయి. ఇవి ఫిబ్రవరి 3 నాటికి భారీగా నమోదయ్యే అవకాశం ఉందని రిపోర్ట్ తెలిపింది. ఐఐటీలోని మ్యాథమేటిక్స, స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్లు సబర పర్షద్ రాజేష్ భాయ్, సుబ్ర శంకర్ ధర్, షల్బా ఈ రిపోర్టు గురించి తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 300కు చేరువైంది. మహారాష్ట్రలో అత్యధికంగా 65 కేసులు, ఢిల్లీలో 64 కేసులు నమోదయ్యాయి.