Global Coronavirus: 2 లక్షల అరవై వేలకు చేరువలో మృతులు, ప్రపంచవ్యాప్తంగా ముఫ్పై ఏడు లక్షలకు పైగా కరోనా కేసులు, యుకెలో 12 లక్షల దాటిన కరోనా కేసులు

కరోనావైరస్ భారీన పడిన వారి సంఖ్య (Coronavirus Global Roundup) బుధవారం నాటికి 3,667,165 గా ఉంది. రికవరి అయిన వారి సంఖ్య 1,251,032గా ఉంది. యాక్టివ్ గా ఉన్న కేసులు సంఖ్య బుధవారం సాయంత్రానికి 2,237,498గా ఉంది. ఇదిలా ఉంటే ఇటలీకు (Italy) చెందిన వైద్య సంస్థ మానవ కణాలలో కరోనావైరస్ నవలని తటస్తం చేసే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.

Coronavirus in Indian Army

Rome, May 6: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ (Global Coronavirus) భారీన పడి మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 2,58,974 కు చేరుకున్నాయి. కరోనావైరస్ భారీన పడిన వారి సంఖ్య (Coronavirus Global Roundup) బుధవారం నాటికి 3,667,165 గా ఉంది. రికవరి అయిన వారి సంఖ్య 1,251,032గా ఉంది. యాక్టివ్ గా ఉన్న కేసులు సంఖ్య బుధవారం సాయంత్రానికి 2,237,498గా ఉంది. ఇదిలా ఉంటే ఇటలీకు (Italy) చెందిన వైద్య సంస్థ మానవ కణాలలో కరోనావైరస్ నవలని తటస్తం చేసే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ఏపీలో 60, తెలంగాణలో 11 కొత్త కేసులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న మద్యం షాపులు, తెలంగాణలో జోన్ల వివరాలు ఓ సారి తెలుసుకోండి

రోమ్ నగరంలోని స్పల్లాంజని ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల ప్రకారం, ఈ టీకాలో మానవ కణాలపై పనిచేసే ఎలుకలలో ఉత్పన్నమయ్యే ప్రతిరోధకాలు ఉన్నాయని ఇటాలియన్ వార్తా సంస్థ ANSA నివేదించింది. ఎలుకలపై ఈ ప్రయోగం విజయవంతమయిందని, వేసవిలో మానవులపై ట్రయల్స్ ప్రయోగిస్తామని సంస్థ తెలిపింది. ఇటలీలో 2,13,013 కేసులు నమోదవగా, 29,315 మంది మృతిచెందారు.

యూరప్‌ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా ఇప్పుడు రష్యాను (Russia) వణికిస్తోంది. ఆ దేశంలో వరుసగా నాలుగోరోజూ 10వేలకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,559 మందికి వైరస్‌ సోకింది. దీంతో రష్యాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 165,000కు పెరిగింది. ఒక రోజు వ్యవధిలో 86 మంది చనిపోవడంతో కరోనా వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,537కు చేరుకున్నది. యూరప్‌లో కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తున్నాయి.  ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం, 50 వేలకు చేరువలో కరోనా కేసులు, దేశ వ్యాప్తంగా 1,694 మంది మృతి, 33,514 కరోనా యాక్టివ్‌ కేసులు

సింగ‌పూర్‌లో ఈ రోజు కొత్త‌గా 788 కోవిడ్ 19 కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో మొత్తం వైర‌స్ బారిన ప‌డిన బాధితులు 20,198 మందికి చేరుకున్నారు. క‌రోనాపాజిటివ్ బాధితుల్లో ఎక్కువ మంది ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన కార్మికులు ఉన్నార‌ని అధికారులు తెలిపారు.

బ్రిటన్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. యూరప్‌లో అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా బ్రిటన్‌ నిలిచింది. జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ ట్రాకర్ ప్రకారం, బుధవారం మధ్యాహ్నం వరకు కోవిడ్‌-19 కారణంగా ఆ దేశంలో 29,501 మంది చనిపోయారు. ఇటలీలో ఇప్పటి వరకు కరోనా వల్ల 29,315 మంది మరణించారు. ఓఎన్‌ఎస్‌ లెక్కల ప్రకారం బ్రిటన్‌లో మహమ్మారి బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 32 వేలు దాటింది.

అగ్రరాజ్యం అమెరికాలో ప్రాణాంతక వైరస్‌ వల్ల గత 24 గంటల్లో 2333 మంది మరణించారు. మొత్తంగా దేశంలో కరోనా మృతుల సంఖ్య 72,271కి చేరింది. అమెరికాలో ఇప్పటివరకు 12,37,633 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న దేశాల్లో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో కేసుల సంఖ్య 2,50,561కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 25,613 మంది బాధితులు మరణించారు.

అదేవిధంగా మరో యూరోపియన్‌ దేశమైన యూకేలో 1,94,990 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఈ వైరస్‌ బారిన పడిన 29,427 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య 1,70,551కి చేరింది. మొత్తం 25,531 మంది మృతిచెందారు. జర్మనీలో ఇప్పటివరకు 1,67,007 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 6,993 మంది మరణించారు.

కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశం అమెరికా. ఇప్పటికే అమెరికాలో 72,284మంది మృత్యువాత పడ్డారు. 12,38,040 పాజిటివ్ కేసులు అక్కడ నమోదు అయ్యాయి. అత్యధిక మరణాలు న్యూయార్క్‌లో నమోదు అయ్యాయి.