Amaravati, May 6: తెలుగు రాష్ట్రాల్లో కరోనా (Coronavirus In Telugu States) చాపకొంద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. తాజాగా ఏపీలో 60 కొత్త కేసులు నమోదు కాగా తెలంగాణలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నెల 29వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించగా. ఏపీలో మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఇక రెండు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. భౌతిక దూరం పాటించి మద్యం కొనుగోలు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సారి కరోనా కేసులను పరిశీలిస్తే.. ఆరు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం, 50 వేలకు చేరువలో కరోనా కేసులు, దేశ వ్యాప్తంగా 1,694 మంది మృతి, 33,514 కరోనా యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh) కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (Coronavirus Cases in AP) 1,777కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 7,782 శాంపిల్స్ పరీక్షించగా.. 60 మందికి కరోనా నిర్దారణ అయినట్టు తెలిపింది. వీరిలో తూర్పు గోదావరి జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 12, వైఎస్సార్ జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 17, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతోపాటుగా కర్ణాటకకి చెందినవి 1, గుజరాత్‌కు చెందినవి 12 కరోనా కేసులు నమోదయ్యాయి. కలెక్టర్లు,ఎస్పీలతో ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్, మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఈ సమయంలో మిగతా 7 జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 729కి చేరింది. ఇప్పటివరకు 36 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం 1012 మంది కరోనాతో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 1,42,274 కరోనా టెస్టులు నిర్వహించారు.
ఇప్పటివరకు తెలంగాణ (Telangana) రాష్ట్రంలో 1,096 మందికి కరోనా పాజిటివ్‌గా Coronavirus Cases in TS) నిర్ధారణ అయింది. ఇందులో 628 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు. మంగళవారం మరో 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. 11 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. వారందరినీ ఆస్పత్రుల్లో చేర్పించారు. మొత్తంగా ఇప్పుడు 439 మంది చికిత్స పొందుతున్నారు. నో మాస్క్, నో లిక్కర్, నేటి నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలు, మే 29 వరకు లాక్ డౌన్ పొడిగింపు, హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్ పరీక్షలు, కరోనాతో కలిసి జీవించాల్సిందేనన్న తెలంగాణ సీఎం కేసీఆర్
జోన్ల వివరాలను ఓ సారి పరిశీలిస్తే..
రెడ్‌జోన్
1. హైదరాబాద్, 2. రంగారెడ్డి, 3. వికారాబాద్, 4. మేడ్చల్, 5. సూర్యాపేట, 6. వరంగల్ అర్బన్
ఆరెంజ్ జోన్
7. ఆదిలాబాద్, 8. నిర్మల్, 9. ఆసిఫాబాద్, 10. నిజామాబాద్, 11, జగిత్యాల, 12. మంచిర్యాల, 13. కామారెడ్డి, 14. సిరిసిల్ల, 15. మెదక్, 16. సంగారెడ్డి, 17. జయశంకర్ భూపాలపల్లి, 18. జనగాం, 19. మహబూబ్‌నగర్, 20. నల్లగొండ,21. ఖమ్మం, 22. జోగులాంబ గద్వాల, 23. కరీంనగర్, 24. నారాయణ్‌పేట్
గ్రీన్‌జోన్
25. సిద్దిపేట, 26. యాదాద్రి భువనగిరి, 27. వరంగల్ రూరల్, 28. మహబూబాబాద్, 29. భద్రాద్రి కొత్తగూడెం, 30. వనపర్తి, 31.నాగర్‌కర్నూల్, 32. పెద్దపల్లి, 33. ములుగు