CM KCR Press Meet Highlights: నో మాస్క్, నో లిక్కర్, నేటి నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలు, మే 29 వరకు లాక్ డౌన్ పొడిగింపు, హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్‌ పరీక్షలు, కరోనాతో కలిసి జీవించాల్సిందేనన్న తెలంగాణ సీఎం కేసీఆర్
Telangana CM K. Chandrashekhar Rao. | File Photo.

Hyderabad, May 6: కరోనాతో (Coronavirus) మనం కలిసి బతకాల్సిందే.ఇది రేపో ఎల్లుండో పోయే గండం కాదు. ఇది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ కొంత ఉపాయంతో రక్షించుకున్నాం. ఇక నుంచి ఉపాయంతో మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు'' అని సీఎం కేసీఆర్ (Telangana chief minister K Chandrashekhar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసుల విషయంలో దేశం కంటే కూడా మనం చాలా తక్కువగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. 1 నుంచి 9 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేవు, నేరుగా పై తరగతులకు ప్రమోట్‌, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, పీజీ మెడికల్‌ సీట్ల ఫీజు పెంపు, జూలైలో నీట్‌ పరీక్షను నిర్వహిస్తామని తెలిపిన ఎంసీఐ

తెలంగాణలో కరోనా వ్యాప్తిని మరింతగా నియంత్రించే ఉద్దేశంతో ఈ నెల(మే) 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు (extends lockdown) సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏడు గంటలకు పైగా కొనసాగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం (Cabinet meeting) ముగిసిన అనంతరం మీడియా సమావేశం (KCR Press Meet) ఏర్పాటు చేసిన కేసిఆర్.. మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ (Coronavirus Lockdown) అని, భౌతికదూరం పాటిస్తూ విజయం సాధించగలిగామని, మరికొంత కాలం పంటి బిగువనో, ఒంటి బిగువనో ఓర్చుకుంటే సంపూర్ణ విజయం సాధించవచ్చునని అన్నారు.

జోన్‌లతో సంబంధం లేకుండా కర్ఫ్యూ

దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 3.37 ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో 2.64 మాత్రమే ఉందని వెల్లడించారు. తెలంగాణలో 628మంది డిశ్చార్జ్ అయ్యారని, మొత్తం కేసుల సంఖ్య 1096గా ఉందని తెలిపారు. తెలంగాణలో 6 జిల్లాలు రెడ్ జోన్‌లో, ఆరెంజ్ జోన్‌లో 18జిల్లాలు.. గ్రీన్ జో‌న్‌లో 9జిల్లాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ఆగస్ట్ సమయానికి వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సీఎం చెప్పారు. జోన్‌లతో సంబంధం లేకుండా అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ సాగించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో మాత్రం కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, రూరల్‌ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.

తెలంగాణలో రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లు ఇవే

తెలంగాణలో 6 జిల్లాలు ( సూర్యాపేట, వికారాబాద్, మేడ్చెల్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాలు) రెడ్ జోన్ కింద ఉన్నట్లు చెప్పారు. ఇక, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట్, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల్, మంచిర్యాల్, నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు ఆరెంజ్ జోన్ లో ఉన్నాయని చెప్పారు. ఇక కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఆయా జోన్ల పరిధిలో నియమనిబంధనలు నేటి నుంచి మారుతాయని సీఎం కేసిఆర్ చెప్పారు .

నిబంధనల మేరకు టెన్త్‌ పరీక్షలు

హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాలు పెంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ, పరీక్షా హాళ్లను శానిటైజ్‌ చేస్తూ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఈ నెలలోనే టెన్త్‌ పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు. ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ రేపటి(మే 6) నుంచి ప్రారంభం అవుతుందని కేసీఆర్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం మార్చిలో టెన్త్ పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. మూడు పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత కరోనా భయాలతో హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంకా ఎనిమిది పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఢిల్లీలో మందుబాబులపై పూలవర్షం, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ఆర్థిక వ్యవస్థని కాపాడేది మీరేనంటూ పూలు చల్లిన ఢిల్లీ మద్యం ప్రియుడు, వైరల్ అవుతున్న వీడియో

పరీక్షల నిర్వహణపై కేబినెట్ నిర్ణయం తీసుకొని అడ్వకేట్‌ జనరల్‌కు ఆదేశాలిచ్చింది. తక్షణమే కోర్టులో అప్లయ్‌ చేయమన్నాం. సీజే ముందు అప్లయ్‌ చేసి కన్సంట్‌ తీసుకోమన్నాం. కోర్టు కూడా పర్మిషన్‌ ఇస్తుందని భావిస్తున్నాం. పిల్లలు, తల్లిదండ్రులు టెన్షన్‌లో ఉన్నారు. వీరికోసం అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేసి. పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తాం. ధనవంతుల పిల్లలుంటే వాళ్లకు స్పెషల్‌ కారు పాసులు కూడా ఇస్తాం. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎస్‌ఎస్‌సీ పరీక్షలను మే నెలలోనే పూర్తి చేస్తాం. ఎందుకంటే ఎస్‌ఎస్‌సీ ఆధారంగానే ఇతర అడ్మిషన్స్‌, ఇంటర్ చదువు ఆధారపడి ఉంటుంది'' అని సీఎం అన్నారు.

నేటి నుంచి మద్యం అమ్మకాలు

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మద్యం అమ్మకాలు జరుగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెడ్ జోన్ జిల్లాలో కూడా వైన్ షాపులకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.కంటెన్మెంట్ జోన్స్‌లోని మద్యం షాపులు మూసి ఉంటాయని కేసీఆర్ చెప్పారు. బార్లు, క్లబ్బులు, పబ్బులకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. మద్యం ధరలు 16 శాతం పెంచుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం రేటు పెంచుతున్నట్లు చెప్పారు. మళ్లీ తగ్గించే అవకాశం కూడా లేదని అన్నారు.  మందు బాబులకు జగన్ సర్కారు ఝలక్, మద్యం ధరలు మరోసారి పెంపు, మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు

కేంద్ర ప్రభుత్వ సడలింపు వల్ల మన చుట్టు ఉన్న నాలుగు రాష్ట్రాలు మద్యం దుకాణాలు తెరిచారని, మన రాష్ట్రానికి ఏపీ 890 కిలోమీటర్ల మేర, మహారాష్ట్ర 700 కిలోమీటర్ల మేర కర్ణాటక 500 కిలోమీటర్ల మేర, చత్తీస్‌గఢ్‌ 230 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉందని, ఈ నాలుగు రాష్ట్రాల్లో షాపులు తెరవడం వల్ల మనవాళ్లు కూడా అక్కడికి పోటెత్తుతున్నారని అందుకే వందశాతం మద్యం దుకాణాలు తెరవనున్నట్లు చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు షాపులు ఓపెన్‌ చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ ప్రకటించారు.  మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు

మే 15 తర్వాత సమీక్ష చేసి మరిన్ని సడలింపులు ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్కడ బౌతిక దూరం పాటించాల్సిదేనని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే వైన్ షాపులను సీజ్ చేస్తామని చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించకపోతే వెంటనే సడలింపులు రద్దు చేస్తామని హెచ్చరించారు. అమ్మేవారు, కొనుగోలు చేసేవారు భౌతిక దూరం పాటించాలని, నిబంధనలు పాటించకున్నా, మాస్క్‌లు లేకుండా మద్యం కొనుగోలు చేసినా లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. నో మాస్క్‌ నో లిక్కర్‌.. నో మాస్క్‌ నో గూడ్స్‌’నినాదం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనావైరస్ వ్యాప్తికి ముందే దేశ ఆర్థిక పరిస్థితి భారీగా దెబ్బతిన్నట్టు చెప్పారు. తెలంగాణకు ప్రతి నెలా అన్నీ కలిపి రూ.15వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉందని చెప్పారు. ఇందులో సొంత పన్నుల ఆదాయమే రూ.10,800 కోట్లు ఉన్నాయని అన్నారు. అయితే వచ్చింది రూ.1,600 కోట్లు మాత్రమేనన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే ప్రతి నెలా రూ.3వేల కోట్లు కావాలన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహాయంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. ఏపీ‌కి క్యూ కట్టిన తమిళనాడు, తెలంగాణ మందుబాబులు, అధికారులకు తెలియడంతో అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేత, దేశ వ్యాప్తంగా భారీగా క్యూ లైన్లు

దేశ ద్రవ్య నియంత్రణ వ్యవస్థను చేతిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులివ్వట్లేదని మండిపడ్డారు. వేరే మార్గాల్లోనైనా నిధులు సమీకరించుకునేందుకు అనుమతించడం లేదన్నారు. ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న హెలికాప్టర్‌ మనీ వంటి మార్గాల్లో డబ్బు సమీకరించుకోవడానికి రాష్ట్రాలను అనుమతించాలని కేసీఆర్ కోరారు. FRBM రుణ పరిమితిని పెంచాలని, రాష్ట్రాల అప్పుల చెల్లింపులను (డిఫర్మెంట్) వాయిదా వేయాలని విజ్ఞప్తిచేశామన్నారు. అయినా కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తోందని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. దేశంలో తొలి రైలు కదిలింది, వలస కార్మికులతో లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి జార్ఖండ్‌కు బయలు దేరిన ప్రత్యేక రైలు

ఈ నెలలో కూడా అప్పులకు సంబంధించి రూ.2,500 కోట్ల వడ్డీలను RBI కట్‌ చేసుకుందని కేసీఆర్ చెప్పారు. కేంద్రం అధికారాలను తన దగ్గర పెట్టుకుని వాడుకోవట్లేదన్నారు. లేదంటే రాష్ట్రాలకు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపేందుకు వారి నుంచి రైలు టికెట్‌ చార్జీలను కేంద్రం వసూలు చేయడం సరైనది కాదన్నారు. వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపేందుకు టికెట్‌ చార్జీల కింద మంగళవారం రూ.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు కట్టిందన్నారు.

రాష్ట్రాల అధికారాలను హరించేలా విద్యుత్ బిల్లు

విద్యుత్‌ చట్టం సవరణ ముసాయిదా బిల్లుపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాల అధికారాలను హరించేలా ఈ బిల్లు ఉందన్నారు. పార్లమెంట్లో పాస్‌ కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్‌ సబ్సిడీలు ఎత్తేయాల్సి వస్తుందన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాలు కోల్పోతామన్నారు. అందరూ సబ్సిడీ లేకుండా విద్యుత్‌ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నగదు బదిలీ రూపంలో సబ్సిడీలను ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.