New Delhi, May 5: ఢిల్లీలో మద్యం షాపులు ఓపెన్ చేయడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. ఉదయాన్నే షాపుల దగ్గరకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి లైన్లో నిల్చున్న మందుబాబులపై పూలవర్షం (A man showers flower petals on people) కురిపించాడు. మీరే దేశ అర్థిక వ్యవస్థని కాపాడేది అంటూ అక్కడ లైన్లో మందు కోసం నిల్చున్న మందుబాబులపై మరో మద్యం ప్రియుడు పూలను నెత్తిన చల్లుకుంటూ వెళ్లాడు. మందు బాబులకు జగన్ సర్కారు ఝలక్, మద్యం ధరలు మరోసారి పెంపు, మద్యం నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఈ సమయంలో మందుబాబులే ప్రభుత్వ ఖజానాని నింపేది అంటూ న్యూఢిల్లీలో చందేర్ నగర్‌లోని (Chander Nagar area of Delhi) ఓ వైన్ షాప్ ఎదుట భారీ లైన్‌లో నిల్చున్న మందుబాబులపై ఆయన ఇలా పూల రేకులను చల్లుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన ఇలా ఉంటే మిర్జాపూర్‌లో భారీ లైన్లలో లిక్కర్ కోసం మండుటెండలో నిల్చున్న మందుబాబులపై ఓ లిక్కర్ షాప్ యజమాని ఇలానే పూలు చల్లాడు.
Here's ANI Video
#WATCH Delhi: A man showers flower petals on people standing in queue outside liquor shops in Chander Nagar area of Delhi. The man says, "You are the economy of our country, government does not have any money". #CoronaLockdown pic.twitter.com/CISdu2V86V
— ANI (@ANI) May 5, 2020
Meanwhile in Mirzapur, liquor shop owners shower flower petals on customers queuing up outside their shops. 😂
👇🏼👇🏼 pic.twitter.com/MuocTljqxy
— Prashant Kumar (@scribe_prashant) May 4, 2020
లాక్‌డౌన్ (Delhi Lockdown 3.0) నిబంధనలను సడలించడంతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యపాన ప్రియులు ఖుషీ అవుతున్నారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు. ఢిల్లీలో అయితే ఏకంగా భౌతిక దూరం పాటించని వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు
దేశబంధు గుప్తా రోడ్డులోని లిక్కర్ షాపు ముందు కిలోమీటర్ల వరకు ఓపిగ్గా నిలబడి రికార్డు సృష్టించారు. కశ్మీర్ గేట్ ప్రాంతంలో ఉన్న మందు దుకాణం ముందు నిలుచున్న మందుబాబులకు పోలీసులు బడితపూజ చేశారు. భౌతిక దూరం పాటించనందుకు లాఠీలతో బాది వారిని చెదరగొట్టారు. నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్ 3.0, దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు సడలింపు, కంటైన్‌మెంట్ క్లస్టర్లలో మరింత పటిష్టంగా చర్యలు
ఇదిలా ఉంటే ఢిల్లీ సర్కారు (Delhi Government) మద్యం ధరలను భారీగా పెంచింది. ‘స్పెషల్ కరోనా ఫీజు’ పేరుతో మద్యం ధరలను 70 శాతం మేర పెంచుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. లిక్కర్ బాటిల్స్‌పై ఉండే గరిష్ట చిల్లర ధరకు ఇది అదనం కానుంది. లాక్‌డౌన్ కారణంగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి ఈ నిర్ణయంతో అదనపు ఆదాయం సమకూర్చనుంది.