Lockdown 3.0 Begins: తెరుచుకోనున్న మద్యం షాపులు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0, దేశ వ్యాప్తంగా పలు ఆంక్షలు సడలింపు, కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో మరింత పటిష్టంగా చర్యలు
India enters Lockdown 3.0 with some relaxations Liquor shops, domestic helps, salons (photo-PTI)

New Delhi, May 4: కరోనాని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన మూడో విడత లాక్‌డౌన్‌ నేటి నుంచి అమల్లోకి (Lockdown 3.0 Started) రానుంది. మూడవసారి పొడిగించిన లాక్ డౌన్ పై (Lockdown) కేంద్ర ప్రభుత్వం ఈసారి కొన్నిటిపై ఆంక్షలు..మరికొన్నిటికి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది. కాగా కరోనా వైరస్‌ (Coronavirus) వ్యాప్తి తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా విభజించిన కేంద్రం ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలను పొడిగించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 11 వేల మందికి పైగా డిశ్చార్జ్, 42 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, 1300 దాటిన మరణాలు, నేటి నుంచి అమల్లోకి లాక్‌డౌన్‌ 3.0

దేశవ్యాప్తంగా సుమారు 130 రెడ్‌ జోన్లు, ఆరెంజ్‌ 284, గ్రీన్‌ జోన్లు 319 ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో19, ఆ తర్వాత మహారాష్ట్రలో 14 రెడ్‌ జోన్లు ఉన్నాయి. జోన్లతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా విమాన, రైలు, మెట్రో ప్రయాణాలు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, శిక్షణ, కోచింగ్‌ సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, మాల్స్, క్రీడా స్థలాలు, ప్రార్థనా స్థలాలు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు మొదలగు వాటికి పూర్తి స్థాయి నిషేధం కొనసాగుతుంది. మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, పట్టాలెక్కనున్న 400 శ్రామిక స్పెషల్ రైళ్లు, కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, పర్యాటకులు, తీర్థయాత్రికులు, విద్యార్థులకు మాత్రమే ప్రయాణ వెసులుబాటు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. పని ప్రదేశాల నుంచి గానీ, సొంతూళ్ల నుంచి గానీ వచ్చి..లాక్‌డౌన్‌ కారణంగా తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల కోసమే ప్రభుత్వం మినహాయింపు కల్పించిందని తెలిపారు. సొంతూళ్లకు మామూలుగా వెళ్లేవారికి, సొంతపనులపై వెళ్లేవారికి ఈ వెసులుబాటు వర్తించదని స్పష్టత అజయ్ భల్లా స్పష్టతనిచ్చారు.. కోవిడ్-19 పోరాట యోధులకు అరుదైన గౌరవం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశం నుంచి పూలవర్షంతో భారత వాయుసేన వందనం, దేశవ్యాప్తంగా స్పూర్థిని రగిల్చిన దృశ్యం

అనుమతి కల్పించే అంశాలు

అన్ని జోన్లలో ఆస్పత్రులలో ఓపీ సేవలకు అనుమతి. కంటెయిన్‌మెంట్ జోన్లలో సామాజిక దూరం తదితర నియమాలు పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలి. రాష్ట్రాల పరిధిలో గ్రీన్ జోన్లలో బస్సులకు అనుమతినిచ్చారు. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే బస్సులు నడిపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షల సడలింపు. వ్యక్తిగత వాహనాలకు అనుమతి. కార్లలో ఇద్దరు ప్యాసింజర్లు ప్రయాణించవచ్చు. టూ వీలర్‌ మీద ఒక్కరికే అనుమతి. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు, సెలూన్లు, స్పా సెంటర్లకు అనుమతి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలి.  పోలీస్ శాఖలో కరోనా కల్లోలం, ముంబై పోలీసుల్లో 100 మందికి పైగా కోవిడ్-19 పాజిటివ్

గ్రీన్‌, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి. గ్రీన్‌ జోన్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు వ్యాపారాలకు అనుమతి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మకాలు సాగించాలి. రెడ్‌ జోన్లలో వారానికి ఒకసారి పరిస్థితి పరిశీలించి.. కేసులు తగ్గితే ఆరెంజ్ జోన్లుగా, ఆరెంజ్ జోన్లను గ్రీన్‌ జోన్లుగా మార్పు. గ్రీన్, ఆరెంజ్ జోన్లో నిత్యావసరాలు, ఔషధ రంగం, వైద్య ఉపకరణలు, ఐటీ, హార్డ్‌వేర్, జ్యూట్ ఇండస్ట్రీ తదితరాలకు నిబంధనలతో అనుమతి. నిర్మాణ రంగంలో కొద్ది మంది కార్మికులతో, సామాజిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు సాగించేలా అనుమతి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కాల్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీ తదితరాలకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అనుమతి.

రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలు. అవసరమైన చోట్ల 144 సెక్షన్ విధింపు.అన్ని జోన్లలో 65 ఏళ్ల పైబడిన వ్యక్తులు, పిల్లలు, గర్బిణులకు అనుమతి నిరాకరణ. ప్రత్యేక అవసరాలకు మాత్రమే బయటకు రావడానికి అనుమతి.ఇక కంటెయిన్‌మెంట్ జోన్లలో ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదు. రెడ్ జోన్లలో సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్ సేవలు, బస్సు సర్వీసులు, సెలూన్లు, స్పా సెంటర్లకు అనుమతి లేదు. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించినా క్షేత్రస్థాయిలో వాటినిఅమలుచేసే బాద్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus in India) ఉద్ధృతి కొనసాగుతున్నది. కేసుల సంఖ్య 42 వేలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 40,263కు చేరింది. మరోవైపు దేశంలో ఒక్కరోజే 83 మంది (Coronavirus Deaths) వైరస్‌ కారణంగా మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,373కుకు చేరినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ  వెల్లడించింది. ఇప్పటి వరకు 11,706 మంది (coronavirus cases) కొవిడ్‌-19 బారి నుంచి కోలుకున్నారని, 29,453 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. మిగతా దేశాలతో పోల్చితే కొవిడ్‌-19 మరణాల రేటు భారత్‌లోనే తక్కువగా ఉన్నదని వెల్లడించింది.