New Delhi, May 1: కరోనావైరస్ లాక్‌డౌన్ (Coronavirus Lockdown) వల్ల తెలంగాణ రాష్ట్రంలో చిక్కుకుపోయిన హర్యానా వలస కార్మికులు ప్రత్యేక రైలులో ఈ రోజు వారి స్వస్థలాలకు తరలివెళ్లారు. లాక్‌డౌన్ తర్వాత ఇలా కార్మికులను రైలులో తరలించడం ఇదే మొదటిసారిగా (First Train Ran Amid Lockdown) చెప్పవచ్చు. సుమారు 1239 మంది వలస కార్మికులతో కూడిన ప్రత్యేక రైలు లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్‌కు (Telangana's Lingampalli to Jharkhand's Hatia) శుక్రవారం ఉదయం 4.50గంటలకు బయల్దేరింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ పొడిగిస్తారా, ఎత్తేస్తారా, ఉత్కంఠ మధ్య క్యాబినెట్ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ, రేపు జాతినుద్దేశించి ప్రసగించనున్న ప్రధాని
కరోనా వైరస్ (2020 Coronavirus Pandemic in India) వ్యాప్తిని నిరోధించడానికి మార్చి 22న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) అమల్లోకి వచ్చింది. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. అయితే పోలీసులు, మిలటరీ, నిత్వావరస వస్తువుల తరలింపునకు ప్రత్యేక రైళ్లు నడపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రయాణికుల కోసం మాత్రం రైల్వే నడపమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వలస కార్మికుల కోసమే మొదటి రైలును ఏర్పాటు చేశారు.
Watch Video of The One-Off Special Train Leaving Telangana
A one-off special train was run today from Lingampalli (Hyderabad) to Hatia (Jharkhand) on request of the Telangana Government & as per the directions of Union Railway Ministry. pic.twitter.com/9YptotxcbV
— ANI (@ANI) May 1, 2020
Update by ANI
Special train was run today from Lingampalli(Hyderabad) to Hatia(Jharkhand)on request of Telangana Govt&as per directions of Railway Ministry. Any other train to be planned as per directions of Ministry of Railways&on request from originating&destination states: Railway official pic.twitter.com/JiGias3BaG
— ANI (@ANI) May 1, 2020
తెలంగాణ రాష్ట్రంలోని కంది మండలం ఐఐటీలో పనిచేస్తున్న జార్ఖండ్ వలస కార్మికులు ఈ ప్రత్యేక రైలులో వారి స్వస్థలాలకు తరలి వెళ్లారు. ఐఐటీ భవన నిర్మాణంలో జార్ఖండ్, పశ్చిమబెంగాల్, బీహార్, ఒడిశాలకు చెందిన 2,464 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తమను సొంత ప్రాంతాలకు వెళ్లనివ్వాలని గత రెండు రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. దీంతో జార్ఖండ్‌కు చెందిన 1239 మంది కార్మికులను ప్రత్యేక రైలులో తరలించారు.