COVID-19 Pandemic: కరోనాపై గుడ్ న్యూస్, ఈ ఏడాది చివర నాటికి ముగింపు దశకు వస్తుందని తెలిపిన డబ‍్ల్యూహెచ్ఓ, ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని తెలిపిన అథనమ్
ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు వ్యాప్తి చెందడంతో లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా ముగింపు దశపై ఆశాజనక ప్రకటన చేసింది.
Geneva, Feb 14: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికే కరోనా వేరియంట్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు వ్యాప్తి చెందడంతో లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా ముగింపు దశపై ఆశాజనక ప్రకటన చేసింది.
డబ‍్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మాట్లాడుతూ... ఈ ఏడాది జూలై, జూన్ మధ్యలో ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ( Can End By Mid Year If 70% Gets Vaccinated) ప్రక్రియ పూర్తి అయితే.. కరోనా (COVID-19 Pandemic) చివరి స్టేజ్ ముగుస్తుందని తెలిపారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గితే ఈ ఏడాది చివరి నాటికి కరోనా ముగింపు దశకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే, అది మన చేతిలోనే ఉందన్నారు. అందరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
దేశంలో గత 24 గంటల్లో 34,113 మందికి కరోనా, నిన్న 346 మంది మృతి, ప్రస్తుతం 4,78,882 యాక్టివ్ కేసులు
ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఆఫ్రికాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై టెడ్రోస్ (General Tedros Adhanom Ghebreyesus) అసంతృప్తి వ‍్యక్తంచేశారు. అక్కడ కేవలం 11శాతం మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగడంతో టీకా పంపిణీపై డబ‍్ల్యూహెచ్ఓ దృష్టి సారించనున్నట్టు అథనమ్ వెల్లడించారు. అయితే, మోడెర్నా సీక్వెన్స్ను ఉపయోగించి ఆఫ్రికాలో మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ టీకాను రూపొందించిన ఆఫ్రిజెన్ బయెలాజిక్స్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. డబ‍్ల్యూహెచ్ఓ, కోవాక్స్ సహకారంలో ఆఫ్రిజెన్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగానే 2024లో ఆఫ్రిజెన్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అథనమ్ పేర్కొన్నారు.