Trip To Titanic Shipwreck: టైటానిక్ శిథిలాలను చూసేందుకు మరోసారి యాత్ర, ఐదు ప్రాణాలు పోయినా వెనక్కు తగ్గని ఓషన్ గేట్ సంస్థ, ఈ సారి ఏకంగా రెండు ట్రిప్‌లు ప్లాన్, ఒక్కో టికెట్ ధర ఎంతంటే?

సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానం అంటూ ఓషియన్ గేట్ (Oceangate) సంస్థ తాజాగా ప్రకటన ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Titan Submersible (Photo Credits: Twitter)

Washington, June 30: అట్లాంటిక్ మహా సముద్రంలో 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ (Titanic) నౌక శిథిలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ (Titan submersible) కథ విషాదాంతమైన విషయం తెలిసిందే. తీవ్ర పీడనం వల్ల అది పేలిపోయి.. అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ సాహసయాత్రలో పేలిపోయిన టైటాన్ జలాంతర్గామి శకలాలు (wreckage) తీరాన్ని కూడా చేరాయి. ఇదిలా ఉండగా.. ఘటన జరిగి పది రోజులు కూడా కాకముందే సంస్థ మరోసారి సాహస యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానం అంటూ ఓషియన్ గేట్ (Ocean gate) సంస్థ తాజాగా ప్రకటన ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Human Remains From Titan: టైటాన్ శిథిలాల నుంచి బిలియనీర్లు మృతదేహాలు స్వాధీనం, సముద్రగర్భం నుంచి తీసుకువచ్చిన కోస్ట్ గార్డ్‌ 

వచ్చే ఏడాది ఏకంగా రెండు ట్రిప్ లకు ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య ఒక ట్రిప్ ప్లాన్ చేయగా.. 2024 జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య రెండో ట్రిప్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే, తాజా నిర్ణయంతో సంస్థ తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇంతటి ఘోర విషాదం జరిగి పట్టుమని పది రోజులు కూడా కాకముందే మరోసారి సాహసయాత్ర అంటూ ప్రకటనలు ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

USA Plane Tragedy: టెక్సాస్‌లోని శాన్ యాంటోనియో ఎయిర్‌పోర్టులో దారుణం.. గాలితోపాటూ వర్కర్‌ను కూడా లోపలికి పీల్చేసుకున్న విమానం ఇంజిన్.. వర్కర్ దుర్మరణం 

1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్నపాటి జలాంతర్గామిని వినియోగిస్తోంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు గెస్టులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 22 అడుగులు పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. కాగా టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు. అంటే మన కరన్సీ ప్రకారం రూ.2కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif