Washington, June 29: టైటానిక్ శిథిలాలను (titanic) చూడటానికి ప్రపంచంలోని ఐదుగురు బిలియనీర్లు జూన్ 18న జలాంతర్గామిలో సముద్రంలోకి వెళ్లిన విషయం విధితమే. అయితే వారు సముద్రంలో దిగిన రెండు గంటలకే వారి కనెక్షన్ తెగిపోయింది. దానిని కనుగొనడానికి అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ కోస్ట్‌గార్డ్స్ వెతుకులాట ప్రారంభించారు. జూన్ 22న జలాంతర్గామి పేలిపోయి అందులో ఉన్న ఐదుగురు మరణించినట్లు ప్రకటించారు. మరోవైపు టైటాన్ జలాంతర్గామి శిథిలాల నుండి బిలియనీర్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ వర్గాలు తెలియజేశాయి. యూఎస్ కోస్ట్ గార్డ్ టైటాన్ సబ్‌మెర్సిబుల్ శిథిలాలను (Titan Wreckage) బుధవారం భూమికి తీసుకువచ్చారు. సముద్రగర్భం నుంచి శిథిలాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ శిథిలాల్లో మృతదేహాలుకూడా ఉన్నాయి. ముఖ్యమైన సాక్ష్యాలను తిరిగి పొందడంలో అంతర్జాతీయ, అంతర్- ఏజెన్సీ మద్దతుకు నేనే కృతజ్ఞుడను అని యూఎస్ కోస్ట్ గార్డ్ చీఫ్ కెప్టెన్ జాసన్ న్యూబౌర్ ఒక ప్రకటనలో తెలిపారు.
🚨#BREAKING: Human remains found in Titanic-tour sub wreckage
The wreckage of the Titan submersible has been successfully retrieved from the sea floor has has arrived at St. John’s harbour in Canada. The Titan, which is believed to have imploded last… pic.twitter.com/sUPuhYdcxe
— R A W S A L E R T S (@rawsalerts) June 28, 2023
శిథిలాల రూపంలో లభించిన సాక్ష్యం అంతర్జాతీయ పరిశోధకులకు వివిధ సమాచారాన్ని పొందేందుకు సహాయపడుతుందని చెప్పారు. రాబోయేకాలంలో అనేక కారణాలను అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా ఇలాంటి సాక్ష్యాధారాల వల్ల మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసేందుకు ఉపకరిస్తుందని తెలిపారు.
టైటాన్ శిథిలాలు సముద్రపు అడుగు భాగంలో 12,500 అడుగుల (3,810 మీటర్లు) నీటిలో, 1,600 అడుగుల (488 మీటర్లు) లోతులో ఉన్నాయని కోస్ట్ గార్డ్ గతవారం తెలిపింది. మరోవైపు కోస్ట్ గార్డ్ పేలుడుపై దర్యాప్తు చేయడానికి మెరైన్ బోర్డ్ ఆఫ్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.