Dubai Floods: ఏడాది మొత్తం మీద కురవాల్సిన వర్షం ఒకే రోజు, దుబాయ్‌లో వరదలు బీభత్సం ఎలా ఉందో ఈ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది
హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. సోమవారం అర్థరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. సోమవారం అర్థరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది.జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు. దుబాయ్ ను ముంచెత్తిన వరదలు, కొట్టుకుపోతున్న కార్లు, ఎయిర్ పోర్టు మూసివేత, ఒమన్ లో 18 మంది మృతి, రెడ్ అలర్ట్ జారీ (వీడియో ఇదుగోండి)
ఏడాది మొత్తం మీద కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం అతలాకుతలమైపోయింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. జాతీయ వాతావరణ కేంద్రం దుబాయ్, అబుదాబి, షార్జా ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోయే 48 గంటల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని తెలిపింది. బుధవారం వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Here's Videos
Dubai was not prepared for this 😳
Do You think that this flood disaster cause because of cloud seeding 🤔#Dubai #dubairain #DubaiStorm #DubaiFlooding #dubaiweather #viralvideo pic.twitter.com/ahaklkLR5a