FedEx Layofffs: మరో కంపెనీలో ఊడుతున్న ఉద్యోగాలు, 10 శాతం ఎంప్లాయిస్‌ను తొలగించనున్న ఫెడెక్స్, రానున్న రోజుల్లో మరింత ఉద్యోగాలు ఊస్ట్

తాజాగా ఫెడెక్స్ (FedEx) కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఆఫీసర్, డైరక్టర్ ర్యాంకుల్లోని 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫెడెక్స్ (FedEx) ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

LOS ANGELES, FEB 02: ఆర్ధికమాంధ్యం ఎఫెక్ట్ తో రోజు రోజుకూ లే ఆఫ్స్ (Layoffs) పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఐటీ కంపెనీలు, పలు మల్టీ నేషనల్ కంపెనీలు  ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఫెడెక్స్ (FedEx) కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఆఫీసర్, డైరక్టర్ ర్యాంకుల్లోని 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఫెడెక్స్ (FedEx) ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. గత జూన్ నుంచి ఇప్పటికే 12వేల మందిని తొలగించింది ఫెడెక్స్. తాజాగా తొలగింపులతో ఆ సంఖ్య మరింత పెరుగనుంది. తాజాగా వెలువడిన కంపెనీ ఫలితాల్లో పూర్ పర్మామెన్స్ ఉన్నట్లు తేలింది.

దీంతో 3.7 బిలియన్ డాలర్ల ఖర్చును ఈ ఏడాది తగ్గించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే లేఫ్స్  జాబితాలో ఉన్న సీనియర్ లెవల్ ఆఫీసర్లకు మెమోలను జారీ చేశారు. అయితే ఏయే కేటగిరీల్లో ఎంతమందిని తొలగించేది ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు. ఫెడెక్స్ లో పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగులు దాదాపు 5,47,000 మంది ఉన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif