Hamas Chief Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ హతం.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్.. సిన్వర్ మృతి ప్రపంచానికి మంచిరోజు అన్న జో బైడెన్
హమాస్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ హతమయ్యారు. ఇజ్రాయెల్ దళాలు ఆయన్ని మట్టుబెట్టాయి.
Newdelhi, Oct 18: హమాస్ (Hamas) ఉగ్రవాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ (Yahya Sinwar) హతమయ్యారు. ఇజ్రాయెల్ దళాలు ఆయన్ని మట్టుబెట్టాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం సాయంత్రం ధ్రువీకరించింది. 2023 అక్టోబరులో ఇజ్రాయెల్ లో 1,200 మందిని చంపి, 250 మందిని బందీలుగా పట్టుకున్న ఘటనకు యాహ్యా సిన్వార్ ను ప్రధాన సూత్రధారిగా చెప్తారు.
ప్రపంచానికి మంచిరోజు
హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్ ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం ఆ దేశంతో పాటు యావత్ ప్రపంచానికి మంచిరోజు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అల్ ఖైదా అధినేత, సెప్టెంబరు 11, 2001 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌ను అంతమొందించిన ఘటనతో తాజా ఘటనను బైడెన్ పోల్చారు.