Boris Johnson Visits Kyiv: ఉక్రెయిన్‌లో బ్రిటన్ ప్రధాని ఆకస్మిక పర్యటన, కీవ్‌లో జెలన్‌ స్కీతో కలిసి తిరిగిన బోరిస్ జాన్సన్, ప్రజలకు భరోసా ఇచ్చిన బ్రిటన్ ప్రధాని

కీవ్ (Kyiv) నగరంపై బాంబుల మోత మోగిస్తున్నాయి.. స్థానిక ప్రజలు నగరాన్ని వదిలిపోతున్నారు.. ఈ సమయంలో బ్రిట్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson) కీవ్ నగరంలో శనివారం హుఠాత్తుగా ప్రత్యక్షం అయ్యారు.

Kyiv, April 10: ఉక్రెయిన్ పై రష్యా (Russia) సైనిక దళాలు విరుచుకుపడుతున్నాయి.. కీవ్ (Kyiv) నగరంపై బాంబుల మోత మోగిస్తున్నాయి.. స్థానిక ప్రజలు నగరాన్ని వదిలిపోతున్నారు.. ఈ సమయంలో బ్రిట్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson) కీవ్ నగరంలో శనివారం హుఠాత్తుగా ప్రత్యక్షం అయ్యారు. కీవ్ నగర వీధుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి కలియతిరిగాడు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే బ్రిటన్ ప్రధాని నేరుగా కీవ్ (Kyiv)నగరంలో ప్రత్యక్ష్యం కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రష్యా సేనల దాడులతో కూలిన భవనాలను బ్రిటన్ ప్రధాని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రష్యాపై పోరుకు మరిన్ని ఆయుధాలిస్తామని జెలెన్ స్కీకి (Zelensky )భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్ కు తమ ధీర్ఘకాల మద్దతు కొనసాగించనున్నట్లు బోరిస్ జాన్సన్ ఈ పర్యటనతో చెప్పకనే చెప్పారు. మరోవైపు క్రమటోర్క్స్ రైల్వే స్టేషన్ పై రష్యా క్షిపణిదాడులు చేసిన దాడి నేపథ్యంలో 52మంది పౌరులు మృతి చెందారు. మరో 100మందికి పైగా గాయాలపాలయ్యారు. దాడుల నేపథ్యంలో స్థానికులు భయాందోళనలో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. రైల్వే స్టేషన్ పై క్షిపణి దాడి ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Russia- Ukraine Conflict:యుక్రెయిన్‌ రైల్వేస్టేషన్‌పై రాకెట్ దాడులు 30 మంది మృతి, వందమందికి పైగా తీవ్రగాయాలు, యుక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యన్ బలగాల మారణకాండ, వెనక్కు తగ్గుతామని చెప్పి మాటతప్పిన రష్యా

రష్యా యుద్ధ నేరాలకు కావాల్సినన్ని రుజువులు దొరికాయని, మా పౌరులను చేతికందినవారినల్లా ఎలా హతమార్చారో అనే విషయాలను రష్యా సైనికులు తమ కుటుంబీకులతో వివరిస్తున్న ఫోన్ సంభాషనలను రికార్డు చేశామని, మాకు పట్టుబడ్డ రష్యా పైలట్ల పౌర నివాస ప్రాంతాలున్న మ్యాపులు దొరికాయని వెల్లడించారు. ఉక్రెయిన్ పై దారుణాలకు పాల్పడుతున్న రష్యాను ప్రపంచ దేశాలు కఠినంగా వ్యవహరించాలని జెలెన్ స్కీ కోరారు. మరోవైపు రష్యామాత్రం ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఉక్రెయిన్ సైన్యమే క్షిపణిని ప్రయోగించిందని మాపై నిందలు మోపుతుందని పేర్కొంది.