Iran- Israel War: మోగిన యుద్ధభేరి.. ఇజ్రాయెల్ పై డ్రోన్ల దాడిని ప్రారంభించిన ఇరాన్.. జనావాసాల మీదకు దూసుకొచ్చిన రాకెట్లు, క్షిపణులు.. వీడియోలు వైరల్
జనావాసాలు ఎక్కువగా ఉన్న ఏరియాలమీదకు అవి దూసుకురావడం వీడియోల్లో కనిపిస్తున్నది.
Tel Aviv, Apr 14: ఇరాన్ (Iran) శనివారం ఇజ్రాయెల్ (Israel) పై డజన్ల కొద్ది డ్రోన్లు (Drones), రాకెట్లు (Rockets), క్షిపణులను ప్రయోగించింది. జనావాసాలు ఎక్కువగా ఉన్న ఏరియాలమీదకు అవి దూసుకురావడం వీడియోల్లో కనిపిస్తున్నది. అయితే, వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. ఈ నెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడిలో ఐఆర్‌జీసీకి చెందిన పలువురు సీనియర్ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు.
#NDTVWorld | Iran Attacks Israel In Retaliation, Raises Fears Of A Regional War https://t.co/N5XoS5yceE
(📷: AFP) pic.twitter.com/bakymG8ayf
దాడికి ఇజ్రాయెలే కారణమని..
ఈ దాడికి ఇజ్రాయెలే కారణమని, ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కు తాము పూర్తిగా అండగా ఉంటామని పునరుద్ఘాటించారు.