Iraq Barbaric Bill: అమ్మాయిలకు 9 ఏళ్లకే పెళ్లి, ఇరాక్‌లో కొత్త ప్రతిపాదిత చట్టం, అమలైతే అంతేనా?

చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తోడు వివాహేతర సంబంధాలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాక్ లాంటి దేశంలో అనైతిక సంబంధాలు చాలా ఎక్కువ.

Iraq new barbaric bill Proposes Law To Reduce Legal Age Of Marriage For Girls To 9(AFP)

Iraq, Aug 9:  ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తోడు వివాహేతర సంబంధాలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాక్ లాంటి దేశంలో అనైతిక సంబంధాలు చాలా ఎక్కువ.

ఈ నేపథ్యంలో ఇరాక్ కొత్త చట్టం తీసుకొచ్చింది. అనైతిక సంబంధాలను అరికట్టడానికి బాల్య వివాహాలను చట్టబద్దం చేసింది ఇరాక్. దీంతో ఇకపై 9 ఏళ్ళకే అమ్మాయిలకు పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదిత చట్టంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాక్‌లో 28 శాతం మంది బాలికలు 18 ఏళ్లు నిండకముందే వివాహం చేసుకున్నారని యునిసెఫ్ నివేదించింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం అమ్మాయిల వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. ఈ బిల్లు పాస్ అయితే మాత్రం అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించబడుతుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే బాల్య వివాహాలు,దోపిడీలు పెరుగుతాయని, మహిళల హక్కులు మరియు లింగ సమానత్వంలో దశాబ్దాల పురోగతిని దెబ్బతీస్తుందని మండిపడుతున్నారు. లింగ సమానత్వం, మహిళల హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతి అంతా కనుమరుగైపోతుందని విమర్శిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు, వారిలో 9 వేల మంది విద్యార్థులే, నిరంతరం వారితో టచ్‌లో ఉన్నామని తెలిపిన జైశంకర్

అయితే అనైతిక సంబంధాల నుండి యువతులను రక్షించడం లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు మరికొంతమంది సమర్థిస్తున్నారు. అలాగే ఈ బిల్లులో ముస్లిం మతానికి చెందిన వారు ముస్లిమేతర స్త్రీలను వివాహం చేసుకోకుండా నిషేధించడం, భర్త అనుమతి లేకుండా మహిళలు తమ ఇళ్లను విడిచిపెట్టకుండా నియంత్రించడం వంటి నిబంధనలను చేర్చారు. అయితే ఈ బిల్లు అమల్లోకి వస్తే తిరోగమన దశ ప్రారంభమవుతుందని, దీనిని అడ్డుకుని తీరుతామని ఇరాక్ సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

గతంలో కూడా ఈ వివాహ చట్టాలకు సంబంధించి బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించగా దీనిని చట్టసభ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif