Gaza Death Toll: శవాలదిబ్బగా మారిన గాజా, నాలుగు రోజుల్లోనే 3వేల మంది మృతి, ఆక్రమిత ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్ర ప్రయత్నాలు, రంగంలోకి అమెరికా విమానం
అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై (Hamas) క్రమంగా పైచేయి సాధిస్తున్నది. వారు ఆక్రమించుకున్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నది. ఇరుపక్షాల ఆధిపత్యపోరులో రెండు దేశాల్లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మరణించారు.
Gaza, OCT 11: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) ఐదో రోజుకు చేరుకున్నది. అక్టోబర్ 6న ప్రారంభమైన ఈ యుద్ధంలో హమాస్‌పై (Hamas) క్రమంగా పైచేయి సాధిస్తున్నది. వారు ఆక్రమించుకున్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నది. ఇరుపక్షాల ఆధిపత్యపోరులో రెండు దేశాల్లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మరణించారు. ఈ మారణహోమంలో పాలస్థీనా (Palestine) కంటే ఇజ్రాయెల్‌లో ఎక్కువ మంది మృతిచెందారు.
కాగా, హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా గాజాలో (Gaza) పలు భవనాలను ఇజ్రాయెల్ కూల్చివేసి వాటిని తమ నియంత్రణలోకి తీసుకుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ఇజ్రాయెల్ బలగాలు (Israel Army) భూదాడికి సమాయత్తం అవుతున్నాయి.
గాజా సరిహద్దుల్లో ఉన్న తమ ప్రాంతాలను తిరిగి నియంత్రణలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఆయుధాలతో కూడిన అమెరికా విమానం బుధవారం ఉదయం ఇజ్రాయెల్‌కు చేరింది. ఇక హమాస్ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) దుర్మర్గపు చర్యగా అభివర్ణించారు.