New Zealand PM Resign: న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా, ప్రకటన చేస్తూ కన్నీటిపర్యంతమైన ప్రధాని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ సంచలన ప్రకటన, కరోనా టైమ్‌లో పాపులర్ అయిన నేత రాజీనామా వెనుక కారణాలివే!
ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా(Resign as New Zealand Prime Minister) చేస్తున్నట్లు అధికార లేబర్ పార్టీ సమావేశంలో వెల్లడించారు.
Wellington, JAN 19: వచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్ (Jacinda Ardern) ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా(Resign as New Zealand Prime Minister) చేస్తున్నట్లు అధికార లేబర్ పార్టీ సమావేశంలో వెల్లడించారు. లేబర్ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22న ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. సాధారణ ఎన్నికలు (General Elections) ఈ ఏడాది అక్టోబర్ 14న జరుగుతాయని తెలిపారు. దీంతో ఆర్డెర్న్ పదవీ కాలం ఫిబ్రవరి 7 తర్వాత ముగియనుంది. వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 2017లో జెసిండా ఆర్డెర్న్(Jacinda Ardern) తొలిసారిగా న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
అయితే మూడేండ్ల తర్వాత 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలో లేబర్ పార్టీ సాధారణ ఎన్నికల బరిలోకి దిగింది. అయితే అనుకున్నంతగా రాణించలేకపోయింది. 49 శాతం ఓట్లతో మొత్తం 120 సీట్లకు గాను 64 స్థానాల్లో లేబర్ పార్టీ (Labour Party) విజయం సాధించింది. అయితే దేశంలో కోవిడ్‌ను సరిగా కట్టడి చేయలేకపోవడం, ఆర్థిక మందగమనం వంటి పరిస్థితుల్లో ఆమె నాయకత్వ పటిమపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది. అదేవిధంగా జెసిండా వ్యక్తిగత ఇమేజ్ కూడా దెబ్బతిన్నది. దీంతో ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ ఓటమి చవిచూసింది. దీంతో తాను మరింతకాలం ప్రధాని పదవిలో కొనసాగలేనని ఆమె ప్రకటించారు.