Japan Dating App: యువత కోసం స్పెషల్ డేటింగ్ యాప్ లాంచ్ చేయనున్న జపాన్
కానీ ఫలితం లేకపోవడంతో తాజాగా ఏకంగా ఓ డేటింగ్ యాప్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అయింది.
జపాన్‌లో యువత విపరీతంగా తగ్గిపోతున్న విషయం తెలిసిందే. దీంతో అతి త్వరలో ఆ దేశం ప్రపంచంలోనే వృద్ధ దేశంగా మారబోతోంది. పెళ్లి, కుటుంబ వ్యవస్థ వంటి విషయాలపై ఆ దేశ యువత విముఖత చూపడంతో బర్త్ రేట్ విపరీతంగా పడిపోవడమే కాకుండా వృద్ధ జనాభా పెరిగిపోతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు జపాన్ ప్రభుత్వం ఏకంగా ఓ డేటింగ్ యాప్‌ని లాంచ్ చేయబోతోంది.
గత 8 ఏళ్లుగా జపాన్‌లో బర్త్ రేట్ దారుణంగా పడిపోతూ వస్తోంది. ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు జపాన్ ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. కానీ ఫలితం పెద్దగా కనిపించడం లేదు. దీంతో తాజాగా ఓ డేటింగ్ యాప్ లాంచ్ చేయడానికి రెడీ అయింది. యువతలో పెళ్లిపై ఆసక్తి పెంచి తద్వారా బర్త్ రేట్‌ను కూడా పెంపొందించాలనేది జపాన్ ప్రభుత్వం ఆలోచన.
అయితే ఈ యాప్‌లో రిజిస్టర్ కావడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. యాప్‌లో రిజిస్టర్ కావాలనుకునే యువత తాము సింగిల్‌గానే ఉన్నామని అఫీషియల్‌గా నిర్ధారించేందుకు డాక్యుమెంట్స్ సమర్పించాలి. అలాగే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఓ లెటర్ సైన్ చేయాలి. అంతేకాకుండా తమ వార్షిక ఆదాయాన్ని నిర్ధారిస్తూ టాక్స్ సర్పిఫికేట్ కూడా సమర్పించాలి. వీటన్నింటికీ తోడు సదరు యూజర్ తాన ఐడెంటిటీని వెరిఫై చేస్తూ ఓ ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ యాప్ వల్ల జపాన్ బర్త్ రేట్ సమస్య ఏ మేరకు తగ్గుతుందో చూడాలి.