India-Maldives Row: మే 10 తర్వాత భారత సైనికులు ఒక్కరు కూడా ఇక్కడ ఉండకూడదు, మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తీవ్ర వ్యాఖ్యలు

మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు మరోసారి భారత్‌పై మీద మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. మే 10 తర్వాత భారత్‌కు చెందిన ఓ ఒక్క మిలిటరీ సిబ్బంది తమ దేశంలో ఉండకూదని తెలిపారు.

Maldivian President Mohamed Muizzu And China President

మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు మరోసారి భారత్‌పై మీద మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. మే 10 తర్వాత భారత్‌కు చెందిన ఓ ఒక్క మిలిటరీ సిబ్బంది తమ దేశంలో ఉండకూదని తెలిపారు. కనీసం సివిల్‌ డ్రెస్సుల్లో కూడా తమ భూభాగంలో తిరగడానికి వీలు లేదంటూ (Maldives Orders Indian Officials) మంగళవారం పేర్కొన్నారు. సైనిక సహకారంపై చైనాతో మాల్దీవులు కీలక ఒప్పందం (Military Pact With China) కుదుర్చుకున్న గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మాల్దీవ్స్‌లోని మూడు వైమానిక స్థావరాల్లో విధులు నిర్వహిస్తున్న భారత బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని గతంలోనే మొయిజ్జు ఆదేశించారు. ఒక వైమానిక స్థావరంలోని బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని ఆర్డర్‌ వేశారు. దానిపై ఫిబ్రవరి 2న ఢిల్లీ వేదికగా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. భారత్‌తో వివాదం తర్వాత చైనా సాయం కోరిన మాల్దీవుల అధ్యక్షుడు, మీ దేశం నుండి ఎక్కువ మంది పర్యాటకులను పంపాలని విజ్ఞప్తి

వెనక్కి తీసుకునే తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బంది (Technical Personnel) ని నియమిస్తామని అప్పుడు ఢిల్లీ పెట్టిన షరతును మాల్దీవ్స్‌ అంగీకరించింది. దాంతో గత వారమే భారత సాంకేతిక బృందం ఆ దీవులకు చేరుకుంది. అయితే, దీనిపై మాల్దీవువ్స్‌లోని కొన్ని విపక్ష పార్టీలు కొత్త వాదనను తెరపైకి తెచ్చాయి.సాంకేతిక సిబ్బంది వాస్తవానికి మిలిటరీ అధికారులేనని, పౌర దుస్తుల్లో వారిని పంపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశాయి.

మాల్దీవులకు భారత్ మరో షాక్, లక్షద్వీప్‌ మినీకాయ్ దీవుల్లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు రంగం సిద్ధం

తాజాగా ముయిజ్జు స్పందిస్తూ.. ‘భారత బలగాల ఉపసంహరణలో మా ప్రభుత్వం విజయం సాధించింది. ఇది చూసి తట్టుకోలేని విపక్షాలు కొత్త ట్విస్ట్‌లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దు. మే 10 తర్వాత భారత బలగాలు దేశంలో ఉండవు. కనీసం సివిల్‌ దుస్తుల్లోనూ వారిని ఉండనివ్వం’ అని ప్రకటించారు.

కాగా మాల్దీవుల్లో మూడు వైమానిక స్థావరాల్లో 88 మంది భారత మిలిటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు రెండు హెలికాప్టర్లు ఒక డోర్నియర్ విమానాల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్యం కోసం తరలింపు వంటి సేవలను అందిస్తున్నారు. అయితే ముయిజ్జు గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌పై వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. ఢిల్లీని దూరం పెడుతున్న మొయిజ్జు ఈ సేవల కోసం గతవారం శ్రీలంకతో ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్తులో అన్ని కేటగిరీల నుంచి భారత సిబ్బందిని వెనక్కి పంపించే సూచనలు కన్పిస్తున్నాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now