Prachanda Loses Vote of Confidence: నేపాల్ లో మ‌రోసారి కూలిపోయిన ప్ర‌భుత్వం, విశ్వాస ప‌రీక్ష‌లో ఓడిపోయిన ప్ర‌చండ‌, 16 ఏళ్ల‌లో ఏకంగా 13 సార్లు మారిన ప్ర‌భుత్వం

ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో (Vote of Confidence) ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ (Nepal PM Pushpa Kamal Dahal) ఓడిపోయారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలువగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి.

'Prachanda' Appointed Nepal's Prime Minister (PIC@ ANI Twitter)

Kathmandu, July 12: అస్థిర రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన నేపాల్‌లో (Nepal) మరోసారి ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వంపై పెట్టిన విశ్వాస తీర్మానంలో (Vote of Confidence) ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ (Nepal PM Pushpa Kamal Dahal) ఓడిపోయారు. ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలువగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. 275 సీట్లు కలిగిన నేపాల్‌ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని పార్టీ నేపాల్‌ ప్రభుత్వానికి (Nepal Govt) మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధాని ప్రచండ విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రచండ 2022 డిసెంబర్‌ 25న నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మాజీ ప్రధాని ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ (CPN-UML) తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Nepal Bus Tragedy: నేపాల్ లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడటంతో నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. 65 మంది గల్లంతు (వీడియోలతో)  

ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే మూడుసార్లు విశ్వాసం ఎదుర్కొన్నారు. అయితే నేపాలీ కాంగ్రెస్‌తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. కానీ అందుకు ప్రచండ నిరాకరించడంతో విశ్వాసం అనివార్యమైంది. నేపాలీ కాంగ్రెస్‌ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలువగా, సీపీఎన్‌-యుఎంఎల్‌కు 78 మంది సభ్యుల బలం ఉంది.

వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలి బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్‌ ఇప్పటికే అంగీకరించినట్లు తెలిసింది. మొత్తంగా నేపాల్‌లో గడిచిన పదహారేళ్లలో 13 ప్రభుత్వాలు మారడం అక్కడి రాజకీయ అస్థిరతకు నిదర్శనంగా చెప్పవచ్చు.