Nepal PM Twitter Hacked: ఏకంగా ప్రధాని ట్విట్టర్‌నే హ్యాక్ చేసిన కేటుగాళ్లు, అధికారిక ఖాతాలో ప్రొఫైల్ పిక్చర్ మార్చిన సైబర్ అటాకర్స్
దహల్ ప్రొఫైల్‌కు బదులుగా ప్రో ట్రేడర్ల కోసం నాన్-ఫంగబుల్ టోకెన్ మార్కెట్ ప్లేస్ అయిన బీఎల్‌యూఆర్ (BLUR) కనిపించింది. ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం @PM_nepal_ అని ఉంది. అయితే అకౌంట్‌ను వెంటనే పునరుద్ధరించారు.
Katmandu, March 16: సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, ముఖ్యనేతల ట్విట్టర్ అకౌంట్లపై (Twitter Account) హ్యాకర్స్ కన్నేశారు. గత కొంతకాలంగా ప్రముఖ సంస్థలు, వ్యక్తుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్‌కు (Hacked) గురవుతున్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున నేపాల్ (Nepal) ప్రధాని పుష్ప కమల్ దహల్ (Pushpa Kamal Dahal) అధికారిక ట్విట్టర్ ఖాతా (official Twitter) హ్యాక్‌కు గురైంది. దహల్ ప్రొఫైల్‌కు బదులుగా ప్రో ట్రేడర్ల కోసం నాన్-ఫంగబుల్ టోకెన్ మార్కెట్ ప్లేస్ అయిన బీఎల్‌యూఆర్ (BLUR) కనిపించింది. ట్విట్టర్ హ్యాండిల్ మాత్రం @PM_nepal_ అని ఉంది. అయితే అకౌంట్‌ను వెంటనే పునరుద్ధరించారు. హ్యాకింగ్ విషయంపై ప్రధాని కార్యాలయం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ అకౌంట్‌కు 690.1K ఫాలోవర్స్ ఉన్నారు.
నేపాల్ ప్రధానిగా పుష్ప కమల్ గతేడాది డిసెంబర్‌లో మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. హ్యాకర్లు ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్‌ను పిన్ చేశారు. ‘సమన్ చేయడం ప్రారంభమైంది. మీ BAKC/SewerPassని సిద్ధం చేసుకోండి అండ్ గెట్ డౌన్ ఇన్ ద పిట్! https://thesummoning.party.’ అని రాసుకొచ్చారు. బ్లర్ అనేది.. వినియోగదారులకు ఫంగబుల్ కాని టోకెన్‌లను (NFTలు) సులభంగా కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి, వ్యాపారం చేయడానికి అనుమతిస్తుంది. దాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో తనను తాను ‘ప్రో ట్రేడర్ల కోసం NFT మార్కెట్‌ప్లేస్’గా పేర్కొన్నది.