New Haiti Disaster: ఘోర ప్రమాదం, ఒక్కసారిగా పేలిన గ్యాస్ ట్యాంకర్‌, 75 మంది సజీవం దహనం, 100 మందికి పైగా తీవ్ర గాయాలు, హైతీలోని క్యాప్‌ హైటియన్‌ నగరంలో విషాద ఘటన

గ్యాస్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో కనీసం 75 మంది సజీవ దహనమయ్యారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో 75 మంది సజీవంగా దహనమవడం (Fireball from Toppled Tanker Kills 75 ) చూశానని నగర డిప్యూటీ మేయర్‌ పాట్రిక్‌ అల్మోనోర్‌ పేర్కొన్నారు

Algeria Wildfires Representational Image (Photo Credits: PTI)

హైతీలోని క్యాప్‌ హైటియన్‌ నగరంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం (New Haiti Disaster) చోటు చేసుకున్నది. గ్యాస్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో కనీసం 75 మంది సజీవ దహనమయ్యారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

సంఘటనా స్థలంలో 75 మంది సజీవంగా దహనమవడం (Fireball from Toppled Tanker Kills 75 ) చూశానని నగర డిప్యూటీ మేయర్‌ పాట్రిక్‌ అల్మోనోర్‌ పేర్కొన్నారు. మృతులను గుర్తించడం అసాధ్యమన్న ఆయన.. పేలుడు కారణంగా సంఘటనా స్థలంలో సుమారు ఇండ్లు కాలిపోయాయన్నారు. ఇంట్లో ఉన్న వ్యక్తుల వివరాలు ఇంకా తెలియలేదని, ఇప్పుడు ఏం చెప్పలేమన్నారు. సంఘటనస్థలం నుంచి మంటలు చుట్టుపక్కలున్న మరో 20 గృహాలకు వ్యాపించడంతో అందులోని వారూ సజీవ దహనమయ్యారు.

బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు

ట్యాంకర్‌ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకునేందుకు జనం బకెట్లతో ఎగబడినపుడు మంటలు అంటుకుని ట్యాంకర్‌ పేలిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇటీవల ముఠాలు గ్యాస్‌లైన్లను స్వాధీనం చేసుకోవడంతో హైతీలో తీవ్ర ఇంధన కొరత ఏర్పడుతున్నది.