New Pneumonia Outbreak: చైనాపై మండిపడిన కజికిస్థాన్, అంతుచిక్కని వ్యాధి కజికిస్థాన్‌ని వణికిస్తుందని చైనా చేసిన ప్రకటన అంతా పుకారని కొట్టి పారేసిన కజకిస్థాన్ ప్రభుత్వం
చైనా ప్రకటనలో నిజం లేదని తేల్చిచెప్పింది. అదంతా ఒట్టి పుకారని తేల్చి చెప్పింది. చైనా ఎంబసీ (Chinese embassy) ప్రకటనను ఖండిస్తూ కజికిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Kazakhstan Health Ministry) తాజా ప్రకటన చేసింది.
Nur-Sultan, July 10: చైనా సరిహద్దు దేశం కజికిస్థాన్‌లో అంతుచిక్కని వ్యాధి విస్తరిస్తున్నదంటూ చైనా చేసిన ప్రకటనను కజకిస్థాన్ ప్రభుత్వం (Kazakhstan Govt) కొట్టిపారేసింది. చైనా ప్రకటనలో నిజం లేదని తేల్చిచెప్పింది. అదంతా ఒట్టి పుకారని తేల్చి చెప్పింది. చైనా ఎంబసీ (Chinese embassy) ప్రకటనను ఖండిస్తూ కజికిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Kazakhstan Health Ministry) తాజా ప్రకటన చేసింది. మరో కొత్త వైరస్ బాంబును పేల్చిన చైనా, అంతుచిక్కని వైరస్‌తో న్యుమోనియా సోకి కజకిస్థాన్‌లో వందలాది మంది మృత్యువాత, జాగ్రత్తగా ఉండాలని చైనీయులకు డ్రాగన్ కంట్రీ హెచ్చరిక
ప్రపంచమంతా కరోనా వైరస్‌తో పోరాటం చేస్తుంటే కజకిస్థాన్‌లో కొత్త రకం వ్యాధి ప్రబలిందని చైనా (China) ప్రకటించింది. ఈ అంతుచిక్కని న్యుయోనియా వ్యాధి బారినపడి గత నెల రోజుల వ్యవధిలో 1772 మంది ప్రాణాలు కోల్పోయారని, అది కరోనా మహమ్మారికంటే ప్రమాదకరమని పేర్కొన్నది. అందువల్ల ఆ దేశంలోని చైనీయులు అప్రమత్తంగా ఉండాలని కజకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం హెచ్చరించింది.
ఈ స్టేట్ మెంట్ పై కజకిస్తాన్ మండిపడింది. ప్రస్తుతం దేశంలో ప్రబలుతున్న వ్యాధికి వైరల్ న్యూమోనియా ఇన్‌ఫెక్షన్ (Pneumonia Outbreak), బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలతో పోలికలు ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాధి కారణంగా అధిక మరణాలు సంభవిస్తున్నమాట వాస్తవమే అయినా, ఇది అంతుచిక్కని వ్యాధి మాత్రం కాదని కజకిస్థాన్ ఆరోగ్య శాఖ పేర్కొన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై రిపోర్టు ఇచ్చిందని తెలిపింది.