US Presidential Elections 2024: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకున్న నిక్కీ హేలీ, ఇక పోటీ బైడెన్, ట్రంప్ మ‌ధ్య‌నే! ప్రచారంలో చ‌రిత్ర సృష్టించిన నిక్కీ

15 రాష్ట్రాల్లో మంగళవారం సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీ ఎన్నికలు జరగగా, అన్ని రాష్ట్రాల్లోనూ ఓడిపోవడంతో ఇండియన్‌-అమెరికన్‌ నిక్కీ హేలీ తన ప్రచారాన్ని నిలిపేశారు.

Nikki Haley (Photo Credit- Facebook)

Washington, March 07: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి జో బైడెన్‌ (Joe Biden), డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) తలపడబోతున్నారు. 15 రాష్ట్రాల్లో మంగళవారం సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీ ఎన్నికలు జరగగా, అన్ని రాష్ట్రాల్లోనూ ఓడిపోవడంతో ఇండియన్‌-అమెరికన్‌ నిక్కీ హేలీ తన ప్రచారాన్ని నిలిపేశారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నారు. నిక్కీ హేలీ సౌత్‌ కరోలినాలో మాట్లాడుతూ, ‘నా ప్రెసిడెన్షియల్‌ క్యాంపెయిన్‌ను నిలిపేయవలసిన సమయం వచ్చింది’ అన్నారు.

Israel Hamas War: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో భారతీయుడు మృతి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అడ్వైజరీని జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం 

అమెరికన్లు తమ గళాలను వినిపించాలని తాను కోరుకుంటున్నానని చెప్పానని, అదే చేశానని చెప్పారు. తనకు విచారం లేదన్నారు. తాను అభ్యర్థిని కాకపోయినప్పటికీ, తాను నమ్మిన విషయాల కోసం గళమెత్తడాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. అయితే ఆమె ఈ క్యాంపెయిన్‌లో చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్‌ ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీని గెలుచుకున్న తొలి మహిళగా, ఓ డెమొక్రాటిక్‌ లేదా రిపబ్లికన్‌ ప్రైమరీలో విజయం సొంతం చేసుకున్న తొలి ఇండియన్‌-అమెరికన్‌గా ఘనత సాధించారు.