ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం గత 5 నెలల నుంచి జరుగుతున్నప్పటికీ ఇప్పట్లో ఆగే సూచనలు కనపడటం లేదు. ఇజ్రాయెల్ – లెబనాన్ సరిహద్దుల్లో నిర్వహించిన క్షిపణి దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయులకు భారత ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరింది. ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయ పౌరులు.. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరిపి.. భద్రత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, గాజా తర్వాత రఫాను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్, రాత్రి దాడుల్లో 48 మంది మృతి, అసంపూర్తిగానే మిగిలిన చర్చలు
Here's News
❗️Safety First: Indians Urged To Relocate As Rockets Rain On Israel
Indian nationals working in Israeli border areas in the north and south have been advised to move to safe areas following the death of one person in anti-tank missile fire from Lebanon, which injured another… https://t.co/ePvrOmXAUF pic.twitter.com/Z8SoSalo7T
— RT_India (@RT_India_news) March 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)