ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మిస్సైళ్లతో దాడి చేసింది. దాంతో అలర్ట్‌ అయిన ఇజ్రాయెల్‌ దాడిని తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. బాలిస్టిక్‌ మిస్సైళ్లతో ఇరాన్‌ తీవ్రంగా విరుచుపడుతున్నట్టు సమాచారం. ఈ దాడికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఇజ్రాయెల్‌ అధికారికంగా ప్రకటించింది. అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఇరాన్‌ ఈ దాడికి పాల్పడింది. దీంతో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 400లకు  మిస్సైళ్లను ఇరాన్‌ ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇక తాజా పరిస్ధితిపై అమెరికా వైట్‌ హౌస్‌ స్పంధించింది. ఇరాన్‌ దాడిపై  బైడెన్‌, కమలా హారిస్‌ సమీక్షిస్తున్నారు. మిస్సైళ్ల దాడి నుంచి సామాన్య ‍ ప్రజలను రక్షించాలని బైడెన్‌ అమెరికా ఆర్మీని ఆదేశించారు.

హెలీన్ హరికేన్ ధాటికి అమెరికా విలవిల, పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం..64 మంది మృతి...వీడియో ఇదిగో

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)