Pakistan President Dissolves National Assembly: పాకిస్థాన్ పార్లమెంట్ రద్దు, ఇమ్రాన్ సిఫార్సును ఆమోదించిన రాష్ట్రపతి, 90 రోజుల్లో ఎన్నికలు జరిగేలా ఆదేశం...

జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)ని రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఆయన ప్రకటించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసిన కొద్ది నిమిషాలకే ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

Pakistan Prime Minister Imran Khan | File photo | (Photo Credits: PTI)

ఇస్లామాబాద్: పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)ని రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఆయన ప్రకటించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసిన కొద్ది నిమిషాలకే ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

పార్లమెంట్ ను రద్దు చేయాలని దేశ అధ్యక్షుడు అరీఫ్ అల్వీకి ప్రధాని ఇమ్రాన్ లేఖ రాశారు. త్వరలోనే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంపై ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నిర్వహించేంత వరకు జాతీయ అసెంబ్లీలో ఆందోళనకు దిగుతామని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఇమ్రాన్ ఖాన్ పైన జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ జరగాల్సి ఉండగా.. అవిశ్వాస తీర్మానంపై పార్లమెట్​లో ఓటింగ్​ వాయిదా పడింది. అదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీకి లేఖ రాసారు. పార్లమెంట్ ను రద్దు చేయాలని సిఫార్సు చేసారు. తాజాగా ఎన్నికలు నిర్వహించాలని రికమెండ్ చేసారు. దీంతో రాష్ట్రపతి ప్రధాని చేసిన సిఫార్సును ఆమోదిస్తూ పార్లమెంట్ రద్దుకు నిర్ణయించారు.

90 రోజుల్లోగా పాకిస్థాన్ లో ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్ష హోదాలో ఆదేశించారు. అంతకుముందు, పాకిస్థాన్ పార్లమెంట్​లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్​కు వ్యతిరేకంగా పార్లమెంట్​లో విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 342 మంది సభ్యుల అసెంబ్లీలో తీర్మానం నెగ్గాలంటే 172 మంది ఓట్లు అవసరం. కాగా, తమకు 177 మంది సభ్యుల బలం ఉందని విపక్షాలు ప్రకటించుకున్నాయి. వంద మందికి పైగా విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానానిపై సంతకం చేశారు. ఈ సమయంలో ప్రధాని ఇమ్రాన్ సభకు హాజరు కాలేదు. అంతలో...సభలో డిప్యూటీ స్పీకర్ అనూహ్య ప్రకటన చేసారు. విపక్షాల తీర్మానాన్ని తిరస్కరించారు.

Andhra Pradesh: ఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు, గ్రూప్‌ 1,2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

తీర్మానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆ వెంటనే ఇమ్రాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తనకు వ్యతిరేకంగా చట్టసభలోని సభ్యులను కొనేందుకు కుట్ర చేసారని..కోట్లాది రూపాయలను ఖర్చు చేసారని చెప్పుకొచ్చారు. అవిశ్వాస తీర్మానం పాక్ పై జరిగిన కుట్ర గా అభివర్ణించారు.

జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడికి లేఖ రాసినట్లుగా ఇమ్రాన్ వెల్లడించారు. ప్రజలే తమను ఎవరు పాలించాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య పద్దతితో ఎన్నికలు జరగాలని ఇమ్రాన్ ఆకాంక్షించారు. పాకిస్థాన్ అధ్యక్షుడు దేశంలో మధ్యంతర ఎన్నికల దిశగా నిర్ణయం తీసుకోవటంతో.. ఇప్పుడు పాకిస్థాన్ లో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.