Pakistan New PM: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్, పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్న షెహబాజ్
72 ఏళ్ల షెహబాజ్ దేశ 33వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పీఎంఎల్-ఎన్ (PML-N), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కూటమి తరఫున షెహబాజ్ ప్రధాని పదవికి పోటీపడ్డారు.
Islamabad, March 03: పాకిస్థాన్ ప్రధానమంత్రిగా (Pakistan PM) వరుసగా రెండోసారీ పాక్ ముస్లింలీగ్-నవాజ్ (PML-N) పార్టీ అగ్రనేత షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ఎన్నికయ్యారు. 72 ఏళ్ల షెహబాజ్ దేశ 33వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. పీఎంఎల్-ఎన్ (PML-N), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కూటమి తరఫున షెహబాజ్ ప్రధాని పదవికి పోటీపడ్డారు. షెహబాజ్‌కు పోటీగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (PTI) పార్టీ అభ్యర్థి ఒమర్ అయూబ్‌ఖాన్ బరిలో దిగారు.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఇవాళ జరిగిన ఓటింగ్‌లో షెహబాజ్ షరీఫ్‌కు అనుకూలంగా 201 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి అయూబ్‌ఖాన్‌కు మద్దతుగా కేవలం 92 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో షెహబాజ్ ప్రధానిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. షెహబాజ్ షరీఫ్ రేపు (సోమవారం) ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.