Pakistan: పాకిస్తాన్‌లో దారుణం, తుపాకీ గురిపెట్టి ఇద్దరు హిందూ యువతులపై గ్యాంగ్ రేప్, లాహోర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో దారుణం

పాకిస్థాన్‌లో (Pakistan) దారుణ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్సులో ఇద్దరు టీనేజ్ హిందూ అక్కచెల్లెళ్ళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పదహారేళ్ళు, పదిహేడేళ్ళు వయసుగల వీరిద్దరూ జూన్ 5న వారి ఇంటికి సమీపంలోని స్థలానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినపుడు ఈ దారుణం (Hindu Sisters Raped in Lahore) జరిగిందని చెప్పారు.

Rape Representative image.

Lahore, June 17: పాకిస్థాన్‌లో (Pakistan) దారుణ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్సులో ఇద్దరు టీనేజ్ హిందూ అక్కచెల్లెళ్ళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పదహారేళ్ళు, పదిహేడేళ్ళు వయసుగల వీరిద్దరూ జూన్ 5న వారి ఇంటికి సమీపంలోని స్థలానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళినపుడు ఈ దారుణం (Hindu Sisters Raped in Lahore) జరిగిందని చెప్పారు. లాహోర్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని ఫోర్ట్ అబ్బాస్, బహవల్‌నగర్‌లో వీరు నివసిస్తున్నారని పోలీసు అధికారి ఇర్షాద్ యాకూబ్ చెప్పారు.

కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిన ఈ అక్కచెల్లెళ్ళను ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి, వారిపై అత్యాచారం (Teenage Hindu Sisters Raped) చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఉమయిర్ అష్ఫక్, కషిఫ్ అలీలను నిందితులుగా గుర్తించినట్లు చెప్పారు. బాలికలపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షలో నిర్థరణ అయినట్లు వివరించారు. ఉమెయిర్‌ను అరెస్టు చేశామని, కషిఫ్‌కు ముందస్తు బెయిలు మంజూరైందని తెలిపారు.

బెంగుళూరులో దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని వివాహితపై యాసిడ్ పోసిన యువకుడు, కంటికి తీవ్ర గాయం

నిందితులు పలుకుబడిగలవారు కావడంతో బాధిత కుటుంబంతో పరిష్కారం కుదుర్చుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు కావడంలో మూడు రోజులు ఆలస్యం జరడానికి కారణం ఇదేనని స్థానికులు తెలిపారు. బాధితుల తండ్రి ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారని స్థానిక మీడియా తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement